అమరవీరుడి వారసురాలు రుక్మిణి

అమరవీరుడి వారసురాలు రుక్మిణి
X
పాన్ ఇండియా లేటెస్ట్ సెన్సేషన్ ‘కాంతార చాప్టర్ 1’లో హీరోయిన్ గా నటించింది రుక్మిణి వసంత్. రెండు షేడ్స్ ఉన్న యువరాణి కనకవతి పాత్రలో ఆమె చూపించిన నటనకు ప్రేక్షకులు, విమర్శకులు ఫిదా అయ్యారు.

పాన్ ఇండియా లేటెస్ట్ సెన్సేషన్ ‘కాంతార చాప్టర్ 1’లో హీరోయిన్ గా నటించింది రుక్మిణి వసంత్. రెండు షేడ్స్ ఉన్న యువరాణి కనకవతి పాత్రలో ఆమె చూపించిన నటనకు ప్రేక్షకులు, విమర్శకులు ఫిదా అయ్యారు. వెండితెరపై ఎంతో అందంగా కనిపించే రుక్మిణి నిజ జీవితంలో ఎంతో విషాదం ఉంది. అయినా.. అది దేశభక్తి ప్రధానమైన విషయం కావడంతో ఇప్పుడు ఆ కథనం సోషల్ మీడియాలో జోరుగా సర్క్యులేట్ అవుతుంది.

రుక్మిణి తండ్రి కల్నల్ వసంత్ వేణుగోపాల్ 2007లో జమ్మూ–కాశ్మీర్‌ ఉరి సరిహద్దులో ఉగ్రవాదులను ఎదుర్కొని వీరమరణం పొందారు. ఆయన ధైర్యసాహసానికి గుర్తింపుగా భారత ప్రభుత్వం అత్యున్నత శౌర్య పురస్కారం ‘అశోక చక్ర’తో గౌరవించింది. కర్ణాటక నుంచి ఈ అవార్డు అందుకున్న తొలి ఆర్మీ ఆఫీసర్‌గా ఆయన చరిత్రలో నిలిచారు.

రుక్మిణి తల్లి సుభాషిణి వసంత్ ప్రముఖ భరతనాట్యం నర్తకి. భర్తను కోల్పోయిన తర్వాత ఆమె వెనుకడుగు వేయకుండా వీర్ రత్న ఫౌండేషన్ స్థాపించి అమరవీరుల కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. ఇప్పటివరకు 120కి పైగా కుటుంబాల పిల్లల చదువుకు ఆమె తోడ్పాటు అందించారు.

రుక్మిణి చిన్నప్పటి నుంచే కళల పట్ల ఆసక్తి చూపింది. లండన్‌లోని రాయల్ అకాడమీ ఆఫ్ డ్రామాటిక్ ఆర్ట్స్ (RADA)లో యాక్టింగ్‌లో శిక్షణ పొందింది. ఆ క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసమే ఆమెను నేడు ఎంతో గుర్తింపు పొందే స్థాయికి తీసుకెళ్లాయి.

‘సప్తసాగరాలు దాటి’తో రుక్మిణి పేరు దక్షిణాదంతా వ్యాప్తి చెందింది. ఆ చిత్రంలో ఆమె ఎమోషనల్ యాక్టింగ్‌కి ఫిల్మ్ ఫేర్ క్రిటిక్స్ అవార్డు పొందింది. ఇప్పుడు ‘కాంతార: చాప్టర్ 1’లో రాజకుమార్తెగా మెరిసి, సౌత్ ఇండస్ట్రీలో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్‌గా మారింది. మరోవైపు ఇప్పటికే రుక్మిణి, ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ‘డ్రాగన్’, అలాగే యష్‌తో ‘టాక్సిక్’ సినిమాల్లో నటిస్తోంది.

Tags

Next Story