క్రేజీ లైనప్ తో రిషబ్ శెట్టి

క్రేజీ లైనప్ తో రిషబ్ శెట్టి
X
కన్నడ సెన్సేషనల్ యాక్టర్ కమ్ డైరెక్టర్ రిషబ్ శెట్టి ఒకటి తర్వాత ఒకటిగా క్రేజీ ప్రాజెక్ట్స్ తో రాబోతున్నాడు. ‘కాంతార‘తో జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్న రిషబ్.. ఇటీవల ఈ మూవీ ప్రీక్వెల్ ‘కాంతార.. చాప్టర్ 1‘తో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. వరల్డ్ వైడ్ గా ఇప్పటికీ ‘కాంతార.. చాప్టర్ 1‘ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.

‘కాంతార.. చాప్టర్ 1‘ చివరిలో ‘కాంతార.. చాప్టర్ 2‘ ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చారు. అయితే.. ఈ సినిమాతో పాటు రిషబ్ కిట్టీలో మరో మూడు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి. వీటిలో ప్రశాంత్ వర్మ ‘జై హనుమాన్‘ ఒకటి. సూపర్ డూపర్ హిట్ ‘హనుమాన్‘ సీక్వెల్ ‘జై హనుమాన్‘లో టైటిల్ రోల్ లో మురిపించబోతున్నాడు రిషబ్. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.

తెలుగులో ‘జై హనుమాన్‘తో పాటు సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో ఒక సినిమా చేయబోతున్నాడు. ‘ఆకాశవాణి’ సినిమా ఫేమ్, రాజమౌళి శిష్యుడు అశ్విన్ గంగరాజు ఈ చిత్రానికి దర్శకుడు. 18వ శతాబ్ధంలో బెంగాల్‌లో జరిగిన ఉద్రిక్త ఘటనల నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుంది.

మరోవైపు మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా రూపొందుతున్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్‘ సినిమాలోనూ రిషబ్ నటిస్తున్నాడు. ఈ సినిమాలో ఛత్రపతి శివాజీ పాత్రలో కనిపించబోతున్నాడు. సందీప్ సింగ్ రూపొందిస్తున్న ఈ మూవీ జనవరి 21, 2027న విడుదలకు ముస్తాబవుతుంది. మొత్తంగా.. ‘కాంతార‘ ఫ్రాంఛైస్ తో పాటు ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్ లో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నాడు రిషబ్ శెట్టి.

Tags

Next Story