అనుష్కకి పోటీగా రవితేజ

టాలీవుడ్ లో రీ రిలీజులో ట్రెండ్ జోరుగా కొనసాగుతూనే ఉంది. గతంలో సూపర్ హిట్టైన సినిమాలను మళ్లీ 4కె వెర్షన్ లో సరికొత్తగా థియేటర్లలోకి తీసుకొస్తున్నారు. ఈకోవలోనే ఇప్పుడు మాస్ మహారాజ రవితేజ సూపర్ హిట్ మూవీ ‘మిరపకాయ్‘ మళ్లీ థియేటర్లలోకి వస్తోంది. జూలై 11న రీ రిలీజవుతుంది.
హరీష్ శంకర్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాలో రవితేజ ఎనర్జీ, పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. రవితేజ సరసన రిచా గంగోపాధ్యాయ్, దీక్షా సేథ్ హీరోయిన్లుగా నటించారు. రమేష్ పుప్పాల ఈ సినిమాను నిర్మించగా, తమన్ సంగీతాన్ని సమకూర్చాడు. ఇటీవలే రవితేజ మరో చిత్రం ‘నా ఆటోగ్రాఫ్ – స్వీట్ మెమోరీస్’ కూడా రీ రిలీజై మంచి ఓపెనింగ్స్ దక్కించుకుంది.
మరోవైపు ‘మిరపకాయ్‘ మూవీ రీ రిలీజవుతోన్న జూలై 11న అనుష్క నటిస్తున్న ‘ఘాటి‘ సినిమా విడుదలకు ముస్తాబవుతుంది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఘాటి‘ పాన్ ఇండియా రిలీజ్ కు రెడీ అవుతుంది. అయితే.. ఒకవైపు కొత్త సినిమాలు విడుదలవుతోన్న సమయంలో ఇలా రీ రిలీజులు రావడం కరెక్ట్ కాదని ఆమధ్య ‘భైరవం‘ విడుదల సందర్భంగా మనోజ్ కామెంట్ చేసిన విషయం తెలిసిందే. అయినా.. రీ రిలీజుల పరంపర కొనసాగుతూనే ఉంది.
-
Home
-
Menu