రామ్ చరణ్ బర్త్‌డే ట్రీట్

రామ్ చరణ్ బర్త్‌డే ట్రీట్
X
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును (మార్చి 27) పురస్కరించుకుని, అభిమానులకు ఓ స్పెషల్ ట్రీట్ అందించేందుకు RC16 టీమ్ సన్నాహాలు చేస్తోంది.

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజును (మార్చి 27) పురస్కరించుకుని, అభిమానులకు ఓ స్పెషల్ ట్రీట్ అందించేందుకు RC16 టీమ్ సన్నాహాలు చేస్తోంది. చరణ్ హీరోగా టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న భారీ చిత్రం RC16పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి.

ఈ సినిమాలో రామ్ చరణ్‌కి జోడీగా జాన్వీ కపూర్ నటిస్తుండగా, ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన తాజా షెడ్యూల్ నిన్న రాత్రి హైదరాబాద్‌లో పూర్తవడంతో, ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ప్రత్యేకించి టైటిల్ గ్లింప్స్ ఇప్పటికే సిద్ధమవగా, దీనికి ఏఆర్ రెహమాన్ అద్భుతమైన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందించేందుకు శ్రమిస్తున్నట్టు తెలుస్తోంది.

ఈ మూవీకి ‘పెద్ది’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్టు టాక్. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. వృద్ధి సినిమాస్, మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్త నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతుంది. పలు ఆటలకు సంబంధించిన వైవిధ్యభరిత కథాంశంగా ఈ చిత్రం ఉండబోతున్నట్టు సమాచారం. 'గేమ్ ఛేంజర్' సినిమా నిరాశ పరచడంతో ఈ చిత్రంపైనే మెగా అభిమానులు ఆశలు పెట్టుకున్నారు.

Tags

Next Story