‘రాజాసాబ్’ టీజర్ లీక్ కలకలం!

‘రాజాసాబ్’ టీజర్ లీక్ కలకలం!
X
పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్‌ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి పూర్తి హారర్‌ కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది.

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న హారర్‌ కామెడీ మూవీ ‘ది రాజాసాబ్’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్ కెరీర్‌లో తొలిసారి పూర్తి హారర్‌ కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ సినిమా డిసెంబర్ 5న విడుదల కానుంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఈ సినిమాపై ఆసక్తిని మరింత పెంచాయి.

ఈ సినిమా టీజర్‌ను జూన్ 16న ఉదయం 10:52 గంటలకు విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే టీజర్ విడుదలకు ముందు 20 సెకన్ల వీడియో ఆన్‌లైన్‌లో లీక్‌ కావడంతో చిత్రబృందం షాక్‌కు గురైంది. దీనిపై మేకర్స్ తీవ్రంగా స్పందిస్తూ, లీక్‌ చేసినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

సోషల్ మీడియాలో అధికారికంగా విడుదల చేసిన స్టేట్‌మెంట్‌లో – 'రాజాసాబ్‌కు సంబంధించి ఎలాంటి లీక్డ్ కంటెంట్‌ను షేర్‌ చేసిన అకౌంట్లను తక్షణమే సస్పెండ్‌ చేస్తాం. ఒరిజినల్‌ అనుభూతిని రీచ్‌ చేసేందుకు అభిమానులు మాతో కలసి సహకరించాలని కోరుతున్నాం' అని హెచ్చరించారు.

ఈ సినిమాతో ప్రభాస్ తన మాస్ ఇమేజ్‌ను పక్కనబెట్టి, వినోదానికి ప్రాధాన్యత ఇచ్చే పాత్రలో కనిపించబోతున్నాడు. నిధి అగర్వాల్‌, మాళవిక మోహనన్‌, రిద్ధి కుమార్‌ హీరోయిన్లుగా నటిస్తుండగా, సంజయ్ దత్, బ్రహ్మానందం, జయరాం, అనుపమ్ ఖేర్, ప్రియదర్శి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. తమన్ సంగీతం ఈ చిత్రానికి మరో ఆకర్షణగా నిలవనుంది.

మొత్తంగా, టీజర్ లీక్ కలకలం తలెత్తినప్పటికీ, ఫ్యాన్స్ అఫీషియల్ గా రిలీజ్ కోసం ఎదురు చూస్తున్నారు. 'ది రాజాసాబ్' టీజర్ ఏ స్థాయి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో అన్న ఉత్కంఠతో రెబెల్ ఫ్యాన్స్ ఉన్నారు.



Tags

Next Story