‘రాజా సాబ్‘ టీజర్ రాబోతుంది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘ది రాజా సాబ్‘. మారుతి దర్శకత్వంలో రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్‌టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఈ తరహా జానర్ ఇదే మొదటిసారి.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో ‘ది రాజా సాబ్‘పై అంచనాలు భారీగానే పెరిగాయి. కానీ.. ఇప్పటివరకూ ఈ మూవీ నుంచి టీజర్ రాలేదు. అసలు ఈపాటికే విడుదలవ్వాల్సిన టీజర్ ఆలస్యమవుతూ వస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ రిలీజ్ పై క్లారిటీ వచ్చేసింది.
మారుతి సన్నిహితుడు, ‘ది రాజా సాబ్‘ సినిమాకి క్రియేటివ్ ప్రొడ్యూసర్ ఎస్కేఎన్ ‘ది రాజా సాబ్‘ టీజర్ గురించి క్రేజీ అప్డేట్ అందించారు. రాబోయే రెండు వారాల్లో ఈ టీజర్ రిలీజ్ కానుందని క్లారిటీ ఇచ్చేశారు ఎస్కేఎన్.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎంతో ప్రతిష్ఠాత్మకంగా ‘ది రాజా సాబ్‘ చిత్రాన్ని నిర్మిస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడీగా నిధి అగర్వాల్, మాళవిక మోహనన్ నటిస్తున్నారు. కీలక పాత్రలో సంజయ్ దత్ కనిపించనున్నాడు. తమన్ అందించిన సంగీతం ‘ది రాజా సాబ్‘కి మరో పెద్ద ప్లస్ కానుందని భావిస్తోంది టీమ్. మరోవైపు.. టీజర్ తోనే ‘ది రాజా సాబ్‘ రిలీజ్ డేట్ పైనా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
-
Home
-
Menu