'రాజా సాబ్' రీమిక్స్ షాక్!

రాజా సాబ్ రీమిక్స్ షాక్!
X
ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' గురించి హైప్ భారీగా పెరిగింది. లేటెస్ట్ గా రిలీజైన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతోంది. పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ఈ సినిమాకోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.

ప్రభాస్ నటిస్తున్న 'ది రాజా సాబ్' గురించి హైప్ భారీగా పెరిగింది. లేటెస్ట్ గా రిలీజైన టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతోంది. పాన్ ఇండియా లెవెల్ లో ఆడియన్స్ ఈ సినిమాకోసం ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాకి మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. ఇందులోని పాటలు, ముఖ్యంగా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఎంతో ఇంటెన్స్ గా ఉండబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది.

ఇదిలావుంటే.. 'రాజా సాబ్' కోసం ఓ బాలీవుడ్ సాంగ్ ను రీమిక్స్ చేద్దామనుకున్నారట. ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో వస్తుండటంతో.. పాన్ ఇండియా ఆడియన్స్ ను టార్గెట్ చేస్తూ ఆ పాటను రీమిక్స్ చేయాలనుకున్నారట. ఇప్పటికే యావత్ దేశంలోనూ ఎంతో పాపులర్ అయిన ఆ పాటను ప్రభాస్, ముగ్గురు హీరోయిన్ల మధ్య చిత్రీకరించాలనేది ప్లాన్.

అయితే.. సదరు పాట రీమిక్స్ కోసం అవసరమైన ఆడియో రైట్స్‌ను పొందే క్రమంలో మూవీ టీమ్ కు ఊహించని షాక్ ఎదురైందట. ఆ పాట రీమిక్స్ కోసం ఆ ఆడియో కంపెనీ రూ.5 కోట్లు డిమాండ్ చేసినట్లు సమాచారం. దీంతో.. ఆ పాటను తీసుకోవాలా? లేక తమన్ తో మరో పాటను కంపోజ్ చేయించాలా? అనే సస్పెన్స్ లో ఉందట టీమ్. మొత్తంగా.. త్వరలోనే 'ది రాజా సాబ్' నుంచి ఫస్ట్ సింగిల్ రానుంది. డిసెంబర్ 5న ఈ సినిమా విడుదలకు ముస్తాబవుతుంది.

Tags

Next Story