‘రాజా సాబ్‘ టీజర్ అనౌన్స్ మెంట్!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. వీటిలో ముందుగా ప్రేక్షకుల ముందుకు రానున్న చిత్రం ‘ది రాజా సాబ్‘. మారుతి దర్శకత్వంలో రొమాంటిక్ హారర్ కామెడీ ఎంటర్టైనర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుంది. రెబెల్ స్టార్ ప్రభాస్ కి ఈ తరహా జానర్ ఇదే మొదటిసారి.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ తో ‘ది రాజా సాబ్‘పై అంచనాలు భారీగానే పెరిగాయి. కానీ.. ఇప్పటివరకూ ఈ మూవీ నుంచి టీజర్ రాలేదు. అసలు ఈపాటికే విడుదలవ్వాల్సిన టీజర్ ఆలస్యమవుతూ వస్తోంది. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను రిలీజ్ చేయాలంటూ ఫ్యాన్స్ ‘ది రాజా సాబ్‘ను ట్విట్టర్ లో ట్రెండింగ్ లో నిలిపారు.
మరోవైపు ఇప్పటికే ‘రాజా సాబ్‘ టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తుంది టీమ్. రేపు ఉదయం 10.34 కి టీజర్ అనౌన్స్ మెంట్ ఇవ్వబోతుంది నిర్మాణ సంస్థ. ఇక ఈ టీజర్ తోనే రిలీజ్ డేట్ పైనా క్లారిటీ ఇవ్వనుందట టీమ్.
Make way for the arrival of #TheRajaSaab 💥💥
— People Media Factory (@peoplemediafcy) June 2, 2025
Kicking off the celebrations from tomorrow at 10:34 AM 😎🥁#Prabhas #RajaSaabఆగమనం
-
Home
-
Menu