ఆర్.నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు

ఆర్.నారాయణమూర్తి సంచలన వ్యాఖ్యలు
X
పీపుల్స్ స్టార్ ఆర్.నారాయణ మూర్తి మరోసారి తన ప్రత్యేక శైలిలో ఇండస్ట్రీ, రాజకీయాలపై స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన కామెంట్స్‌పై చిరంజీవి ఇచ్చిన స్పందన వంద శాతం నిజం అని ఆయన వ్యాఖ్యానించారు.

నారాయణ మూర్తి మాట్లాడుతూ, ‘జగన్ మోహన్ రెడ్డిని కలిసిన వారిలో నేనూ ఒకణ్ణి. మేము సినీ పరిశ్రమ తరపున వెళ్లినప్పుడు ఆయన ఎంతో గౌరవంగా మాతో మాట్లాడారు. జగన్ గారు ఎవరినీ అవమానించలేదు. గత గవర్నమెంట్ చిరంజీవి గారిని అవమానించిందన్న ప్రచారం పూర్తిగా తప్పుడు వార్త‘ అని తెలిపారు.

ఇక చిరంజీవి వ్యక్తిత్వం, ఆయన సంస్కారం గురించి ప్రస్తావిస్తూ, ‘ఆ రోజు సమస్య పరిష్కారం కావడానికి ప్రధాన కారణం చిరంజీవి గారు. ఆయనే స్వయంగా నన్ను ఫోన్ చేసి ఆహ్వానించారు. అది ఆయన గొప్పతనం‘ అని నారాయణ మూర్తి అభిప్రాయపడ్డారు.

సినిమా టికెట్ ధరలపై తన అభిప్రాయం వెల్లడించిన ఆయన, ‘సినిమా అనేది సామాన్యుడికి కూడా వినోదాన్ని పంచే సాధనం. టికెట్ ధరలు పెంచితే సామాన్యుడు ఇబ్బంది పడతాడు. అందుకే టికెట్ ధరలు పెంచకూడదు‘ అని స్పష్టంగా చెప్పారు.

అలాగే, ‘ఇంకా ఇండస్ట్రీలో పెండింగ్‌లో ఉన్న సమస్యలను ప్రస్తుత ప్రభుత్వం పరిష్కరించాలని నేను కోరుకుంటున్నాను. బాలకృష్ణ గారి విషయమై నేను ఏమీ మాట్లాడదల్చుకోలేదు‘ అని చెప్పి తన వ్యాఖ్యలను ముగించారు.

Tags

Next Story