పూరి-సేతుపతి టైటిల్ కి కౌంట్‌డౌన్

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, తమిళ మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి తొలిసారి కలిసి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. పూరి కనెక్ట్స్, జెబీ మోషన్ పిక్చర్స్ కలిసి నిర్మిస్తున్న ఈ పాన్-ఇండియా సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, టబు, దునియా విజయ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈరోజు పూరి జగన్నాథ్ పుట్టినరోజు సందర్భంగా చెన్నైలోని గ్రీన్ పార్క్ హోటల్‌లో ఈ సినిమా టైటిల్ టీజర్ లాంచ్ చేయబోతున్నారు. ఈ మూవీకి ‘బిక్షాందేహి, మాలిక్, బెగ్గర్’ వంటి పేర్లు వినిపించినా, చివరికి ‘స్లమ్‌డాగ్’ అనే టైటిల్ ఫైనల్ చేసినట్లు టాక్. ఓ బిచ్చగాడి జీవితాన్ని ఆసక్తికరంగా చూపించే కథ కావడంతో ఈ పేరు బాగా సరిపోతుందని ఫిల్మ్ యూనిట్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
'లైగర్, డబుల్ ఇస్మార్ట్' వంటి పరాజయాల తర్వాత పూరి ఈసారి తప్పక హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. మరోవైపు, విజయ్ సేతుపతి తొలిసారి తెలుగులో హీరోగా కనిపించబోతుండటంతో అంచనాలు రెట్టింపు అయ్యాయి. ఈరోజు మధ్యాహ్నం ఈ మూవీ టైటిల్ టీజర్ రాబోతుంది.
-
Home
-
Menu