పూరి-సేతుపతి ప్రాజెక్ట్ లో సంయుక్త!

పూరి-సేతుపతి ప్రాజెక్ట్ లో సంయుక్త!
X
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అప్ కమింగ్‌ మూవీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి క్రేజీ బ్యూటీ సంయుక్త ఆన్ బోర్డులోకి వచ్చింది.

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ అప్ కమింగ్‌ మూవీ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తవుతున్నాయి. మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో సీనియర్ బ్యూటీ టబు, కన్నడ స్టార్ దునియా విజయ్ ఇతర కీలక పాత్రల్లో కనిపించబోతున్న సంగతి తెలిసిందే. లేటెస్ట్ గా ఈ ప్రాజెక్ట్ లోకి క్రేజీ బ్యూటీ సంయుక్త ఆన్ బోర్డులోకి వచ్చింది.

వెల్కమింగ్ స్టన్నింగ్ సంయుక్త ఆన్ బోర్డ్ ఇన్ టూ ది ఎలక్ట్రిఫైయింగ్ వరల్డ్ ఆఫ్ 'పూరి-సేతుపతి' అని ఓ పోస్ట్ పెట్టింది నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్. ప్రస్తుతం తెలుగులో 'అఖండ 2' వంటి పవర్ ఫుల్ మూవీలో నటిస్తున్న సంయుక్తకి.. ఇది మరో ఛాలెంజింగ్ రోల్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ప్రీ ప్రొడక్షన్ పనులు పూర్తిచేసుకున్న పూరి-సేతుపతి ప్రాజెక్ట్ పట్టాలెక్కడానికి సిద్ధం ఉంది.



Tags

Next Story