ప్రభాస్ నమ్మకమే ‘ది రాజా సాబ్‘.. మారుతి!

ప్రభాస్ నమ్మకమే ‘ది రాజా సాబ్‘.. మారుతి!
X
ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది రాజా సాబ్‘. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి టీజర్ వచ్చేసింది.

ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ది రాజా సాబ్‘. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మాణంలో రూపొందుతున్న ఈ చిత్రం నుంచి టీజర్ వచ్చేసింది.ఈరోజు హైదరాబాద్ ప్రసాద్ ఐమాక్స్‌లో గ్రాండ్‌గా టీజర్ ఈవెంట్ జరిగింది. ఈ ఈవెంట్‌కు ఫ్యాన్స్ భారీగా తరలివచ్చారు. 35 అడుగుల ప్రభాస్ కటౌట్‌ ఈ వేడుకకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

ఈ సందర్భంగా డైరెక్టర్ మారుతి మాట్లాడుతూ ప్రభాస్‌తో తన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్‘ మూవీ ఫెయిలయ్యాక తాను కాస్త వెనక్కి తగ్గినా.. ప్రభాస్ నమ్మకంతోనే ‘ది రాజా సాబ్‘ సెట్ అయ్యిందని అన్నారు. వింటేజ్ ప్రభాస్‌ని చూపించాలని ఫిక్స్ అయ్యామన్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్లు చేయలేదని, ఆయన సూచన మేరకు ముగ్గురు హీరోయిన్‌లను తీసుకున్నట్లు మారుతి చెప్పారు.

ఈవెంట్‌లో ఎస్ కే ఎన్ మాట్లాడుతూ, ‘పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్రాండ్ స్థాయి టీజర్‌ ద్వారా అర్థమవుతుంది. డిసెంబర్ 5న సినిమా విడుదల తర్వాత మారుతి చూపించిన వింటేజ్ ప్రభాస్ బాక్సాఫీస్ ను షేక్ చేస్తారు‘ అన్నారు.

మరోవైపు ‘ది రాజా సాబ్‘ టీజర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతుంది. టీజర్ లో ప్రభాస్ వింటేజ్ లుక్, రొమాన్స్, కామెడీ ప్రధానంగా ఆకట్టుకుంటున్నాయి. మారుతి మార్క్ కామెడీతో పాటు వి.ఎఫ్.ఎక్స్. ఈ మూవీకి మరో అట్రాక్షన్. తమన్ బి.జి.ఎమ్. బాగుంది.

నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ విలన్ పాత్రలో మెరవబోతున్నట్టు టీజర్ ను బట్టి తెలుస్తోంది. మొత్తంగా.. ప్రభాస్ ఫ్యాన్స్ కు ‘ది రాజా సాబ్‘ టీజర్ విజువల్ ట్రీట్ అందించిందనే కాంప్లిమెంట్స్ సోషల్ మీడియాలో వస్తున్నాయి. డిసెంబర్ 5న ‘ది రాజా సాబ్‘ ఆడియన్స్ ముందుకు రానుంది.



Tags

Next Story