యూరప్ లో ప్రభాస్ స్టెప్పులు

కొన్ని సినిమాలుగా ప్రభాస్ లోని ఫన్ యాంగిల్ ను ఫ్యాన్స్ మిస్సయ్యారు. అలాగే అదిరిపోయే డ్యాన్స్ నంబర్స్ కూడా రాలేదు. ఆ లోటును తీరుస్తానంటున్నాడు ‘ది రాజా సాబ్‘. మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో హంగామా సృష్టిస్తోంది. లేటెస్ట్ గా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ సినిమాలోని ఒక క్రేజీ డాన్స్ నంబర్ గురించి హింట్ ఇచ్చాడు.
ప్రభాస్ ఈ వింటేజ్ డ్యాన్స్ నంబర్ కు సంబంధించి ఓ చిన్న క్లిప్ ను కూడా షేర్ చేశాడు. ఈ వీడియోలో ప్రభాస్ వేసుకున్న కలర్ ఫుల్ షూస్ మాత్రమే చూపించారు. ఇక నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ధి కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తున్న ఈ చిత్రంలోని పాటలను ప్రస్తుతం యూరప్ లో చిత్రీకరిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ‘ది రాజా సాబ్‘ సంక్రాంతి కానుకగా విడుదలకు ముస్తాబవుతుంది.
Our DarlingggggS #Prabhas Anna Back to his Countageos & Vintageous Dance 💃 Mode 📈🔥
— thaman S (@MusicThaman) October 8, 2025
Love u @DirectorMaruthi darling
Many more happy Returns of the day ❤️🔥#HBDMaruthi#HappyBirthdayMaruthi 🙌🏿#TheRajaSaab pic.twitter.com/Qp43MW2bbg
-
Home
-
Menu