'హిట్ 3'పై పాజిటివ్ బజ్!

హిట్ 3పై పాజిటివ్ బజ్!
X
నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్ 3: థర్డ్ కేస్' సినిమాపై భారీగా పాజిటివ్ బజ్ ఏర్పడుతుంది.

నేచురల్ స్టార్ నాని ప్రధాన పాత్రలో, శైలేష్ కొలను దర్శకత్వంలో రూపొందిన 'హిట్ 3: థర్డ్ కేస్' సినిమాపై భారీగా పాజిటివ్ బజ్ ఏర్పడుతుంది. మే 1న ఈ యాక్షన్ థ్రిల్లర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. లేటెస్ట్‌గా జరిగిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు స్టార్ డైరెక్టర్ రాజమౌళి, 'హిట్' సిరీస్ హీరోలు అడివి శేష్, విశ్వక్ సేన్‌లు ముఖ్య అతిథులుగా హాజరవ్వడం, సినిమాపై ఆసక్తిని పెంచింది.

ఈ సందర్భంగా నాని తన జర్నీపై ఆసక్తికర విషయాలు షేర్ చేస్తూ, 'హిట్ 3'పై తన పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. 'ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వబోతున్నా. మీ అంచనాలకు తగిన రీతిలో సినిమా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు' అని ధీమాగా చెప్పాడు. అంతే కాదు, సరదాగా, 'హిట్ 3 నచ్చకపోతే, వచ్చే ఏడాది రాజమౌళి-మహేష్ బాబు కాంబినేషన్‌లో వస్తున్న SSMB29 చూడొద్దంటూ' వ్యాఖ్యానించి నవ్వులు పూయించాడు. నాని వ్యాఖ్యలతో మహేష్ మూవీ వచ్చే సంవత్సరం రాబోతుందని హింట్ ఇచ్చినట్టు అయ్యింది

నాని చెప్పిన హామీ అభిమానుల్లో భారీ నమ్మకాన్ని నెలకొల్పింది. ఇటీవల 'కోర్ట్' విషయంలో నాని చెప్పినవన్నీ నిజమయ్యాయి. ఇప్పుడు 'హిట్ 3' కూడా బ్లాక్‌బస్టర్ అవుతుందనే నమ్మకంతో ఉన్నారు సినీ లవర్స్. మే 1న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ సినిమా, 'హిట్' సిరీస్‌కు మరింత ఉత్సాహం చేకూర్చనుందని సినీ వర్గాల్లో టాక్ నడుస్తోంది.

Tags

Next Story