బెట్టింగ్ యాప్స్‌పై పోలీసుల కఠిన చర్యలు

X
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు బెట్టింగ్ యాప్స్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిలోనే 15 మంది ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో, బాధితుల వివరాలు సేకరించి, 15 కేసులు నమోదు చేశారు.
తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలతో పోలీసులు బెట్టింగ్ యాప్స్‌పై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఏడాదిలోనే 15 మంది ఆత్మహత్యలు చేసుకున్న నేపథ్యంలో, బాధితుల వివరాలు సేకరించి, 15 కేసులు నమోదు చేశారు. అక్రమంగా పనిచేస్తున్న 108 వెబ్‌సైట్లు ఇప్పటికే బ్లాక్ చేయగా, మరో 133 బెట్టింగ్ ప్లాట్‌ఫామ్స్‌కు నోటీసులు ఇచ్చారు.
సెలబ్రిటీ ప్రమోషన్ల విషయంలో విచారణ కొనసాగుతోంది. విజయ్, రానా లాంటి నటులు స్కిల్ బేస్డ్ గేమ్స్‌కే ప్రమోషన్ ఇచ్చామని చెబుతున్నా, పోలీసులు కొత్త కోణాల్లో వివరాలు వెలికి తీసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇన్‌ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, నటులను విచారించగా, కొంతమంది పరారీలో ఉన్నట్లు సమాచారం. సినీ ప్రముఖులకు ఈ యాప్స్ ద్వారా డబ్బు ఎలా చేరిందనే అంశంపై పోలీసులు దృష్టి పెట్టారు.
Next Story
-
Home
-
Menu