పీపుల్ మీడియా మూవీస్ లైనప్!

టాలీవుడ్‌లో గత కొన్నేళ్లుగా కంటెంట్ ఆధారిత సినిమాలతో పాటు స్టార్ హీరోల ప్రాజెక్టులను కూడా బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్తున్న బ్యానర్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సంస్థ ఒక ఫ్యాక్టరీ మోడల్ లో వరుస సినిమాలను నిర్మిస్తుంది. తెలుగులో తక్కువ సమయంలోనే ఎక్కువ చిత్రాలను నిర్మించిన సంస్థగానూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఎదుగుతుంది.
చిన్న సినిమాల నుంచి పాన్ ఇండియా ప్రాజెక్టుల వరకు ఇప్పుడు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి క్రేజీ లైనప్ రాబోతుంది. 'మిరాయ్'తో పాన్ ఇండియా హిట్ అందుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి ఈ దీపావళి కానుకగా 'తెలుసు కదా' సినిమా వస్తోంది. సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి రొమాంటిక్ ట్రయాంగిల్ లవ్ స్టోరీ ఇది.
దీపావళి తర్వాత వచ్చే సంక్రాంతి బరిలో 'ది రాజా సాబ్'ను తీసుకొస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ ఇది. రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతుంది. ప్రస్తుతం యూరప్ లో 'ది రాజా సాబ్' పాటల చిత్రీకరణ సాగుతుంది.
ఆ తర్వాత 'గూఢచారి 2, మిరాయ్ 2, మోగ్లీ, జాంబిరెడ్డి 2, మా కాళీ, జాట్ 2' వంటి సినిమాలు లైన్లో ఉన్నాయి. వీటితో పాటుగా పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగానూ ఒక సినిమా చేయడానికి రెడీ అవుతుందట పీపుల్ మీడియా ఫ్యాక్టరీ. మొత్తంగా.. టాలీవుడ్ లో చాలా తక్కువ కాలంలోనే అగ్ర స్థానానికి చేరుకుంది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ.
-
Home
-
Menu