‘పెద్ది’ మ్యూజికల్ ట్రీట్ ఖాయం!

‘పెద్ది’ మ్యూజికల్ ట్రీట్ ఖాయం!
X
సినిమా ప్రియులలో భారీ అంచనాలను పెంచుతున్న చిత్రాలలో రామ్ చరణ్ 'పెద్ది' ఒకటి'. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు.

సినిమా ప్రియులలో భారీ అంచనాలను పెంచుతున్న చిత్రాలలో రామ్ చరణ్ 'పెద్ది' ఒకటి'. పీరియాడిక్ స్పోర్ట్స్ డ్రామాగా ఈ సినిమాని బుచ్చిబాబు తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో రామ్ చరణ్ రా అండ్ రస్టిక్ మాస్ లుక్ లో అదరగొట్టబోతున్నట్టు ఇప్పటికే పోస్టర్స్ ను బట్టి తెలుస్తోంది. జనవరి 6న ఈ మూవీ నుంచి ఫస్ట్ గ్లింప్స్ వస్తోంది.

'పెద్ది' చిత్రానికి లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. ఆయన సంగీతం ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా మారనుంది. తాజాగా ఈ సినిమా ఆడియో రైట్స్ ను ప్రముఖ మ్యూజిక్ సంస్థ టీ-సిరీస్ దక్కించుకుంది. అంటే, ఈ చిత్రంలోని పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీ-సిరీస్ ద్వారా అందుబాటులోకి రానున్నాయి. ఈ ఆడియో రైట్స్ ను టి-సిరీస్ రూ.35 కోట్ల భారీ మొత్తానికి దక్కించుకున్నట్టు తెలుస్తోంది.

మొత్తంగా ఇటీవల కాలంలో వరుస విజయాలతో ఏ.ఆర్.రెహమాన్ మళ్లీ ఫామ్ లోకి వస్తున్నాడు. ఈనేపథ్యంలో ‘పెద్ది’ మ్యూజిక్ ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో? అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. రామ్ చరణ్ మాస్ పెర్ఫార్మెన్స్, ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్, బుచ్చిబాబు స్టోరీ టెల్లింగ్ కలిసొచ్చి ఈ సినిమాను ఓ విజువల్ అండ్ మ్యూజికల్ ట్రీట్‌గా మారుస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు!

Tags

Next Story