సినిమాలు చేయడంపై పవన్ క్లారిటీ!

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా బిజీగా ఉన్న పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలు చేయగలరా? అనే ప్రశ్న అభిమానుల్లోనూ, సినీ వర్గాల్లోనూ ఉత్కంఠ రేపుతోంది. 'హరిహర వీరమల్లు, ఓజి' షూటింగ్స్ కొంత పెండింగ్‌లో ఉండగా, 'ఉస్తాద్ భగత్ సింగ్' చేస్తారా? లేదా? అనేది ఇంకా స్పష్టత రాలేదు. అలాగే, సురేందర్ రెడ్డి ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యిందనే ప్రచారం కూడా ఉంది.
ఈ నేపథ్యంలో, తాజాగా ఒక తమిళ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పవన్ స్వయంగా తన మనోగతాన్ని వెల్లడించారు. సినిమాలు ఆపే ఉద్దేశ్యం తనకు లేదని, అయితే పాలనా బాధ్యతలకు ఎక్కడా ఆటంకం లేకుండా అవకాశం ఉన్నప్పుడు సినిమాలు చేస్తానని తెలిపారు. జనసేన కార్యకలాపాలకు, విరాళాలకు అవసరమైన నిధుల కోసం సినిమాలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
కానీ, ఇప్పట్లో పవన్ సినిమాలు చేయడం సాధ్యమవుతుందా? అనే ప్రశ్న కూడా తలెత్తుతోంది. ఇటీవల 'హరిహర వీరమల్లు' వాయిదా పడడం వెనుక పవన్ పాలిటిక్స్ తో బిజీగా ఉండడమే కారణం. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త సినిమాలు ఒప్పుకున్నా, వాటికి న్యాయం చేయగలరా? అనేది సందేహమే. ఇక పవన్ నటిస్తున్న 'హరిహర వీరమల్లు' మే 9న విడుదలకు ముస్తాబవుతుంది.
-
Home
-
Menu