వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్

వైరల్ జ్వరంతో బాధపడుతున్న పవన్
X
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత నాలుగు రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గత నాలుగు రోజులుగా వైరల్ జ్వరంతో బాధపడుతున్నారు. వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నప్పటికీ జ్వరం తీవ్రత తగ్గకపోవడంతో పాటు దగ్గు ఎక్కువై ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మెరుగైన వైద్యం కోసం పవన్ కళ్యాణ్ ఈరోజు మంగళగిరి నుంచి హైదరాబాద్ వెళ్లనున్నారు.

ఇక జ్వరంతో బాధపడుతున్నప్పటికీ పవన్ కళ్యాణ్ సోమవారం అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అనంతరం అధికారులతో టెలీకాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించారు. ఇటీవల ‘ఓజీ‘ ప్రీరిలీజ్ వేడుకలో వర్షంలో తడుస్తూ పాల్గొనడం ఆయన ఆరోగ్య సమస్యలు మరింతగా పెరగడానికి కారణమయ్యిందని చెబుతున్నారు.

పవన్ కళ్యాణ్ అస్వస్థతపై అభిమానులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు కూడా పవన్ కళ్యాణ్ త్వరగా ఆరోగ్యవంతంగా మారాలని ఆకాంక్షించారు. ఇదే సమయంలో పవన్ నటించిన ‘ఓజీ‘ సినిమా బ్లాక్‌బస్టర్ విజయంతో అభిమానుల్లో ఆనందం నెలకొన్నా, ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. త్వరగా పవన్ కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.



Tags

Next Story