'A' సర్టిఫికెట్ తో 'ఓజీ'

A సర్టిఫికెట్ తో ఓజీ
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' థియేటర్లలో సందడి చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, సాంగ్స్, ట్రైలర్‌ పై చర్చలే హాట్‌టాపిక్‌గా మారాయి.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ 'ఓజీ' థియేటర్లలో సందడి చేయడానికి కేవలం రెండు రోజులు మాత్రమే ఉంది. ఈనేపథ్యంలో ప్రస్తుతం ఎక్కడ చూసినా ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, సాంగ్స్, ట్రైలర్‌ పై చర్చలే హాట్‌టాపిక్‌గా మారాయి. లేటెస్ట్ గా ఈ మూవీ సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తయ్యాయి.

యాక్షన్, వయొలెన్స్ ఎక్కువగా ఉండటంతో సెన్సార్ బోర్డు ఈ మూవీకి ‘A’ సర్టిఫికెట్ జారీ చేసింది. అలాగే ఈ సినిమాకు 2 గంటల 34 నిమిషాల (154 నిమిషాలు) రన్‌టైమ్‌ను ఫిక్స్ చేశారు. దీంతో ఈ చిత్రం పర్ఫెక్ట్ పేస్‌లో సాగి అభిమానులను ఎంటర్టైన్ చేయడం ఖాయమని యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది.

మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో 'ఓజీ' ప్రీమియర్ షో లలో మార్పు జరిగింది. సెప్టెంబర్ 25న అర్థరాత్రి 1 గంటకు బదులు 24న రాత్రి 10 గంటలకు 'ఓజీ' ప్రీమియర్ షోకు అనుమతులు జారీ అయ్యాయి. తెలంగాణలోనూ 24న రాత్రి 9 గంటలకు స్పెషల్ షోస్ ప్రదర్శించనున్నారు.


Tags

Next Story