‘ఓజీ‘.. ద ఫస్ట్ బ్లడ్ కామిక్

‘ఓజీ‘..  ద ఫస్ట్ బ్లడ్ కామిక్
X
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం దర్శకుడు సుజీత్ మరో సర్ప్రైజ్ రెడీ చేస్తున్నాడు. ‘ఓజీ’ సినిమాకి ముందు జరిగే కథను ప్రత్యేకంగా కామిక్ బుక్ రూపంలో తీసుకొస్తున్నాడు.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కోసం దర్శకుడు సుజీత్ మరో సర్ప్రైజ్ రెడీ చేస్తున్నాడు. ‘ఓజీ’ సినిమాకి ముందు జరిగే కథను ప్రత్యేకంగా కామిక్ బుక్ రూపంలో తీసుకొస్తున్నాడు. దానికి ‘ఓజీ: ద ఫస్ట్ బ్లడ్’ అనే టైటిల్ పెట్టారు. ఈ బుక్ కవర్‌పై పవన్ కళ్యాణ్‌తో పాటు నేతాజీ సుభాష్ చంద్రబోస్, ఒక మహిళ, చిన్నారి కనిపించడం ఆసక్తి రేపుతోంది. అంటే, సినిమాలోని బ్యాక్‌స్టోరీని ఫ్యాన్స్ ముందు కొత్త స్టైల్‌లో ప్రెజెంట్ చేస్తున్నారు అన్నమాట.

ఇక ఈ కామిక్ బుక్ తర్వాత సినిమాగా కూడా మారుతుందా? అనేది ఇప్పుడు ఫ్యాన్స్‌కి హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు ‘ఓజీ‘ విషయానికి వస్తే.. పవన్ కళ్యాణ్ కెరీర్‌లోనే అతిపెద్ద ఓపెనింగ్స్ సాధించిన మూవీగా నిలిచింది. ఇప్పటికే రూ.200 కోట్లకు పైగా వసూళ్లను సాధించిన ఈ చిత్రం లాంగ్ రన్ లో మరింతగా దూసుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి.



Tags

Next Story