‘ఓజీ’ మెగా స్పెషల్ షో

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా ‘ఓజీ’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంటోంది. ఇప్పటికే రూ.250 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లు సాధించిన ఈ చిత్రం పవన్ కెరీర్‌లో మరో మైలురాయిగా నిలుస్తోంది.
ఈ విజయోత్సవాన్ని మరింత ప్రత్యేకం చేస్తూ లేటెస్ట్ గా మెగా ఫ్యామిలీ కోసం 'ఓజీ' స్పెషల్ స్క్రీనింగ్ జరిగింది. ఈ షో కి మెగాస్టార్ చిరంజీవి, ఆయన సతీమణి సురేఖ, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, అకీరా నందన్, ఆద్య, ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. మెగా కుటుంబంతో పాటు డైరెక్టర్ సుజీత్, తమన్ కూడా ఈ షోలో పాల్గొన్నారు.
చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడం అభిమానుల్లో సంబరాన్ని రేపింది. రామ్ చరణ్ సినిమా గురించి 'సూపర్' అంటూ స్పందించగా, చిరు.. నిర్మాత దానయ్య, దర్శకుడు సుజీత్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్‌లను అభినందించారు. ఇప్పటికే హిట్ టాక్ తెచ్చుకున్న 'ఓజీ'కి ఈ మెగా ఫ్యామిలీ స్క్రీనింగ్ మరింత బజ్ తీసుకొచ్చింది.
-
Home
-
Menu