అన్న కోసం వస్తోన్న తమ్ముడు!

అన్న కోసం వస్తోన్న తమ్ముడు!
X
ఈనెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రాలలో కళ్యాణ్ రామ్ 'అర్జున్ S/O వైజయంతి' ఒకటి. వెటరన్ హీరోయిన్ విజయశాంతి ఈ సినిమాలో పవర్‌ఫుల్ రోల్ లో కనిపించబోతుంది.

ఈనెలలో టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయబోతున్న చిత్రాలలో కళ్యాణ్ రామ్ 'అర్జున్ S/O వైజయంతి' ఒకటి. వెటరన్ హీరోయిన్ విజయశాంతి ఈ సినిమాలో పవర్‌ఫుల్ రోల్ లో కనిపించబోతుంది. కళ్యాణ్ రామ్, విజయశాంతి తల్లీకొడుకులుగా టైటిల్ రోల్స్ లో నటించిన సినిమా ఇది. లేటెస్ట్ గా ఈ మూవీ నుంచి తల్లీకొడుకుల బంధాన్ని చూపిస్తూ రూపొందిన ‘ముచ్చటగా బంధాలే’ అనే లిరికల్‌ సాంగ్‌ విడుదలైంది.

అజనీష్ లోక్‌నాథ్ సంగీతంలో రఘురామ్ రాసిన ఈ పాటను హరిచరణ్ ఆలపించాడు. ఈ పాటలో తల్లీ కొడుకుల మధ్య ఉన్న అనురాగాన్ని అద్భుతంగా ఆవిష్కరించారు. కొత్త దర్శకుడు ప్రదీప్‌ చిలుకూరి డైరెక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ కథానాయికగా నటిస్తుంది.

ఏప్రిల్ 18న విడుదలకు ముస్తాబవుతోన్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 12న ఏర్పాటు చేస్తున్నారు. ఈ ఈవెంట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా విచ్చేస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్తూరులో జరిగిన ఈ సాంగ్ లాంఛ్ ఈవెంట్ లో తెలిపాడు కళ్యాణ్ రామ్.



Tags

Next Story