వారసుల హవా మొదలైంది!

తెలుగు చిత్రసీమలో మరో తరం స్టార్ కిడ్స్ హీరోలుగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు. బాలకృష్ణ తనయుడు మోక్షఙ్ఞ, పవన్ కళ్యాణ్ కుమారుడు అకిరా నందన్, మహేష్ బాబు తనయుడు గౌతమ్ త్వరలోనే వెండితెరపై కథానాయకులుగా కనిపించబోతున్నారు.
మోక్షఙ్ఞ తొలి సినిమా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కాల్సి ఉంది. ఇప్పటికే అందుకు సంబంధించి అనౌన్స్‌మెంట్ వచ్చింది. అయితే ఈ సినిమా ఆలస్యమైనా భారీ స్థాయిలో రూపొందనుందని టాక్. మరోవైపు వెంకీ అట్లూరితో మరో సినిమా లైన్లో ఉంది. ఇంకా తన తండ్రి బాలకృష్ణ స్వయంగా దర్శకత్వం వహించే 'ఆదిత్య 999' సినిమాలో కూడా మోక్షఙ్ఞ నటించనున్నాడు. అటు వైజయంతీ మూవీస్ బ్యానర్లో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. మొత్తంగా మోక్షఙ్ఞ లైనప్ భారీగానే ఉంది.
పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ ఇప్పటికే పియానో, యోగా, మార్షల్ ఆర్ట్స్, ఫోటోగ్రఫీ తదితర రంగాల్లో శిక్షణ తీసుకున్నాడు. తాజాగా నటనలో మెళకువలు నేర్చుకునేందుకు యాక్టింగ్ క్లాసులు అటెండ్ అవుతున్నాడట. రామ్ చరణ్ అకిరాను భారీ స్థాయిలో లాంచ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నాడని టాక్.
మహేష్ బాబు తనయుడు గౌతమ్ ప్రస్తుతం అమెరికాలో యాక్టింగ్ ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. ఇటీవల ఓ స్కిట్‌లో నటించిన వీడియో వైరల్ అవుతోంది. చిన్నతనంలోనే '1.. నేనొక్కడినే'లో నటించిన గౌతమ్, స్టేజ్ షోల ద్వారా తన ప్రతిభను నిరూపించుకుంటూ ముందుకు సాగుతున్నాడు. త్వరలోనే గౌతమ్ హీరోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడని సమాచారం.
-
Home
-
Menu