సంక్రాంతి బరిలో నవీన్ పోలిశెట్టి

యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి అంటేనే నవ్వులు. అయితే ఆమధ్య యాక్సిడెంట్ జరిగిన కారణంగా షూటింగ్స్ కు దూరమయ్యాడు. మళ్లీ కోలుకుని తన లాంగ్ పెండింగ్ ప్రాజెక్ట్ ‘అనగనగా ఒక రాజు‘ని పూర్తి చేస్తున్నాడు. ఈ సినిమాలో నవీన్ కి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తుంది. మిక్కీ జె మేయర్ సంగీతాన్ని సమకూరుస్తున్నాడు.
సితార ఎంటర్ టైన్ మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘అనగనగా ఒక రాజు‘ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. వచ్చే సంక్రాంతి కానుకగా ఈ సినిమాతో నవ్వులు పంచడానికి రెడీ అవుతున్నాడు నవీన్ పోలిశెట్టి. జనవరి 14న ఈ సినిమాని విడుదల చేయబోతున్నట్టు ఓ మోషన్ పోస్టర్ తో తెలియజేశారు.
ఇప్పటికే సంక్రాంతి బరిలో మెగాస్టార్ ‘మెగా 157‘ ఉంది. ఇప్పుడు నవీన్ చిత్రం కూడా చేరడంతో.. రాబోయే సంక్రాంతికి రెండు సినిమాలు పక్కాగా విడుదల తేదీలు ఖరారు చేసుకున్నట్టు అయ్యింది.
We’re bringing everyone’s favorite entertainer @NaveenPolishety to the big screens this Sankranthi! #AnaganagaOkaRaju is hitting theatres on Jan 14th, 2026 💥💥
— Naga Vamsi (@vamsi84) May 26, 2025
Eesari Pandaga ki full enjoy chestaru ❤️🔥❤️🔥#AOROnJan14th 💫 #NaveenPolishetty4 @Meenakshiioffl #Maari… pic.twitter.com/HCQ9uIiRot
-
Home
-
Menu