నార్నే నితిన్-శివాని పెళ్లి వేడుక

టాలీవుడ్ యువ హీరో, యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది నార్నే నితిన్ వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. హైదరాబాద్ శివార్లలోని శంకర్‌పల్లిలో శుక్రవారం రాత్రి జరిగిన ఈ వేడుకలో సినీ, రాజకీయ రంగాల ప్రముఖులు హాజరై జంటను ఆశీర్వదించారు.
ప్రముఖ పారిశ్రామికవేత్త నార్నే శ్రీనివాసరావు కుమారుడైన నితిన్, 2023లో విడుదలైన ‘మ్యాడ్‘ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. ఆ తర్వాత ‘మ్యాడ్ స్క్వేర్, ఆయ్, శ్రీ శ్రీ శ్రీ రాజావారు‘ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.
వధువు తాళ్లూరి శివాని నెల్లూరు జిల్లాకు చెందిన తాళ్లూరి వెంకట కృష్ణప్రసాద్–స్వరూప దంపతుల కుమార్తె. ఆమె కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఉంది. అలాగే.. సీనియర్ హీరో వెంకటేష్ కుటుంబానికి సన్నిహిత బంధువులు.
పెళ్లి వేడుకలో ఎన్టీఆర్ తన భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్‌లతో కలిసి హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. తారక్ స్వయంగా అతిథులను ఆహ్వానిస్తూ, పెళ్లి ఏర్పాట్లలో చురుకుగా పాల్గొన్నాడు. ఆయన స్టైలిష్ లుక్, ఫ్యామిలీ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
-
Home
-
Menu