నాని-సుజీత్ సినిమా ప్రారంభం

నాని-సుజీత్ సినిమా ప్రారంభం
X
పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘తో బడా బ్లాక్ బస్టర్ అందుకున్న స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. గతంలోనే నేచురల్ స్టార్ నానితో సుజీత్ డైరెక్షన్ లో ఒక సినిమా ప్రకటించారు.

పవన్ కళ్యాణ్ ‘ఓజీ‘తో బడా బ్లాక్ బస్టర్ అందుకున్న స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ కొత్త సినిమాకి శ్రీకారం చుట్టాడు. గతంలోనే నేచురల్ స్టార్ నానితో సుజీత్ డైరెక్షన్ లో ఒక సినిమా ప్రకటించారు. అయితే.. అప్పట్లో డి.వి.వి. ఎంటర్ టైన్ మెంట్స్ లో ఈ సినిమా తెరకెక్కాల్సి ఉండగా.. ఇప్పుడు నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ ఆన్ బోర్డులోకి వచ్చింది.

నిహారిక ఎంటర్ టైన్ మెంట్స్ పై వెంకట్ బోయినపల్లి నిర్మిస్తున్న ఈ చిత్రం ముహూర్తం ఈరోజు దసరా సందర్భంగా జరిగింది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. నాని 34వ చిత్రంగా తెరకెక్కే ఈ మూవీకి ‘బ్లడీ రోమియో‘ అనే టైటిల్ వినిపిస్తుంది. ప్రస్తుతం ‘ది ప్యారడైజ్‘ను పూర్తి చేస్తున్న నాని.. సుజీత్ సినిమాని డిసెంబర్ నుంచి పట్టాలెక్కిస్తాడట. 2026 క్రిస్మస్ బరిలో ఈ చిత్రం రాబోతున్నట్టు తెలుస్తోంది.

Tags

Next Story