నాగ్ 100వ మూవీ.. డబుల్ ట్రీట్ రెడీ!

నాగ్ 100వ మూవీ.. డబుల్ ట్రీట్ రెడీ!
X
కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే 100వ సినిమాను ప్రారంభించబోతున్నాడు. ఆర్. కార్తీక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

కింగ్ అక్కినేని నాగార్జున తన కెరీర్‌లో మరో మైలురాయిగా నిలిచే 100వ సినిమాను ప్రారంభించబోతున్నాడు. ఆర్. కార్తీక్ దర్శకత్వంలో రూపొందనున్న ఈ భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్రస్తుతం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాకి ‘లాటరీ కింగ్’ అనేది టైటిల్ గా వినిపిస్తుంది. ఇక ఈ మూవీ ఒక హై వోల్టేజ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతోందని సమాచారం.

ఈ చిత్రంలో నాగ్ డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారట. వీటిలో ఒకటి శక్తివంతమైన రాజకీయ నాయకుడి పాత్ర కాగా, మరోటి డిఫరెంట్ షేడ్స్‌ కలిగిన వ్యక్తిగా ఉంటుందట. ఇది అభిమానులకు డబుల్ ఫీస్ట్ అనే చెప్పాలి. అదేకాక, సినిమాలో ముఖ్యమంత్రి పాత్ర కూడా కీలకమైందట, దానికోసం మేకర్స్ ఒక స్టార్ హీరోయిన్ ను సంప్రదిస్తున్నారని ఇండస్ట్రీ టాక్.

మొదట ఈ సినిమాలో టబు నటించబోతుందనే వార్తలు వచ్చాయి. కానీ ఆమె ఆరోగ్య కారణాల వల్ల తప్పుకోవడంతో, ఆమె స్థానంలో నయనతారను తీసుకోవాలని చిత్ర బృందం నిర్ణయించిందట. నాగ్–నయన్ జంట గతంలో ‘బాస్’లో మెప్పించిన సంగతి తెలిసిందే. అలాగే ఈ మూవీలో నాగార్జున ఇద్దరు కుమారులు నాగచైతన్య, అఖిల్ కూడా ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారన్న వార్త అభిమానుల్లో మరింత ఉత్సాహం నింపుతోంది. త్వరలో నాగార్జున 100 మూవీపై అధికారిక ప్రకటన రానుందట.

Tags

Next Story