ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల్లో నాగవంశీ

ఎన్టీఆర్ పుట్టినరోజు వేడుకల్లో నాగవంశీ
X
ఎన్టీఆర్ పుట్టినరోజు అభిమానులకు పండగ రోజు. ఈసారి తారక్ బర్త్‌డే స్పెషల్ గా సూపర్ హిట్ మూవీ 'యమదొంగ' రీ రిలీజయ్యింది. హైదరాబాద్ లోని ప్రసిద్ధ విమల్ థియేటర్ లో 'యమదొంగ' షో సందర్భంగా.. తారక్ కి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖ నిర్మాత నాగవంశీ కేక్ కట్ చేశారు.

ఎన్టీఆర్ పుట్టినరోజు అభిమానులకు పండగ రోజు. ఈసారి తారక్ బర్త్‌డే స్పెషల్ గా సూపర్ హిట్ మూవీ 'యమదొంగ' రీ రిలీజయ్యింది. హైదరాబాద్ లోని ప్రసిద్ధ విమల్ థియేటర్ లో 'యమదొంగ' షో సందర్భంగా.. తారక్ కి బర్త్ డే విషెస్ చెబుతూ ప్రముఖ నిర్మాత నాగవంశీ కేక్ కట్ చేశారు. ఈ వేడుకలో తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) జనరల్ సెక్రటరీ వై.జె. రాంబాబు పాల్గొన్నారు.

ఈ వేడుకలో ఎన్టీఆర్ అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని తమ అభిమానాన్ని హర్షాతిరేకాల మధ్య వ్యక్తం చేశారు. మరోవైపు ఎన్టీఆర్ బర్త్‌డే స్పెషల్ గా ఈరోజు 'వార్ 2' నుంచి టీజర్ రాబోతుంది. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్-గ్రీక్ గాడ్ ఆఫ్ బాలీవుడ్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందుతున్న చిత్రం కావడంతో 'వార్ 2'పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. 'వార్ 2' టీజర్ వస్తుండటంతో ఎన్టీఆర్-నీల్ మూవీ నుంచి అప్డేట్ ఇవ్వడం లేదని ఇప్పటికే క్లారిటీ ఇచ్చింది 'డ్రాగన్' టీమ్.



Tags

Next Story