నాగచైతన్య కొత్త సాహసం ప్రారంభం!

నాగచైతన్య కొత్త సాహసం ప్రారంభం!
X
యువ సామ్రాట్ నాగ చైతన్య ప్రస్తుతం తన పూర్తి దృష్టిని 'NC24' (వర్కింగ్ టైటిల్) పై కేంద్రీకరించాడు. కార్తీక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్న ఈ మిస్టికల్ థ్రిల్లర్‌కు బీవీఎస్ఎన్ ప్రసాద్, సుకుమార్ సంయుక్తంగా నిర్మాణ బాధ్యతలు చేపట్టారు.

ఈ సినిమా పురాణాల నేపథ్యంతో మిస్టికల్ థ్రిల్లర్ గా తెరకెక్కుతోంది. ఇందులో చైతన్య సాహసోపేతమైన పాత్రలో కనిపించబోతున్నాడు. లేటెస్ట్ గా ఈ మూవీ కాన్సెప్ట్ ను తెలియజేస్తూ.. ఈ చిత్రం కోసం టీమ్ ఎలా కష్టపడుతుంది? ఎలాంటి సెట్స్ ను నిర్మిస్తుంది అనే విషయాలను తెలియజేస్తూ ఓ మేకింగ్ వీడియోని రిలీజ్ చేసింది. ఈ వీడియో ఆద్యంతం ఆకట్టుకుంటుంది.

సంగీత దర్శకుడిగా 'కాంతార', 'విరూపాక్ష' చిత్రాల ఫేమ్ అజనీష్ లోక్‌నాథ్ పనిచేస్తున్నాడు. ఈ సినిమాలో చైతన్యకి జోడీగా మీనాక్షి చౌదరి నటించనుందనే ప్రచారం ఉంది. మొత్తంగా 'తండేల్'తో భారీ విజయాన్నందుకున్న చైతన్య.. ఇప్పుడు నెక్స్ట్ NC24 తో అంతకుమించి అన్న రీతిలో సందడి చేయడానికి సిద్ధమవుతున్నాడు.

Tags

Next Story