మోహన్ లాల్ బర్త్ డే గ్లింప్స్

మోహన్ లాల్ బర్త్ డే గ్లింప్స్
X
విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్లు కేమియోలలో మురిపించబోతున్నారు.

విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా ‘కన్నప్ప’ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. భారీ తారాగణంతో రూపొందుతున్న ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, కాజల్ అగర్వాల్ లాంటి స్టార్లు కేమియోలలో మురిపించబోతున్నారు. ఈరోజు (మే 21) మలయాళీ సూపర్ స్టార్ మోహన్ లాల్ బర్త్ డే స్పెషల్ గా ‘కన్నప్ప‘ నుంచి స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేశారు.

‘కన్నప్ప‘ చిత్రంలో మాలీవుడ్ సూపర్ స్టార్ మోహన్ లాల్ కిరాట అనే ప‌వ‌ర్‌ఫుల్ రోల్‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఈ గ్లింప్స్ లో గంభీరమైన మోహన్ లాల్ లుక్ చూస్తుంటే ఈ చిత్రంలో ఆయన పాత్ర ఎంతో హైలైట్ గా ఉండబోతున్నట్టు తెలుస్తోంది.

విష్ణు మంచు టైటిల్ రోల్‌లో కనిపించనున్న ‘కన్నప్ప‘లో ప్రీతి ముకుందన్ కథానాయికగా నటిస్తోంది. అవా ఎంటర్టైన్మెంట్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. జూన్ 27న పాన్ ఇండియా లెవెల్ లో ‘కన్నప్ప‘ విడుదలవుతుంది.



Tags

Next Story