‘ది ప్యారడైజ్’లో మోహన్ బాబు!

నేచురల్ స్టార్ నాని ఎప్పుడూ కొత్త కథలతో, వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను మెప్పిస్తూ వస్తున్నాడు. నాని లేటెస్ట్ మూవీ ‘ది ప్యారడైజ్’ టాలీవుడ్‌లోనే కాకుండా పాన్ ఇండియా లెవెల్‌లో భారీ అంచనాలను సృష్టిస్తోంది. ‘దసరా’ బ్లాక్‌బస్టర్ తర్వాత నాని – శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్ రిపీట్ అవ్వడం, గ్లోబల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమా మీద హైప్ రెట్టింపైంది.
ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, జడల లుక్ పోస్టర్స్ సినిమాపై మంచి క్యూరియాసిటీని పెంచాయి. లేటెస్ట్ గా ఈ మూవీలో సీనియర్ యాక్టర్ నట ప్రపూర్ణ మోహన్‌బాబు నటిస్తున్నట్టు క్లారిటీ వచ్చేసింది. ఈ ప్రాజెక్ట్ గురించి అధికారికంగా బయటకు రాని ఈ సీక్రెట్‌ను నటి మంచు లక్ష్మి బయటపెట్టింది. 'దక్ష' మూవీ ప్రమోషన్స్ లో మాట్లాడుతూ 'నాన్నగారు ‘ది ప్యారడైజ్’లో కీలక పాత్ర చేస్తున్నారు. ఆ లుక్ కోసం ఈ వయసులోనూ ఆయన చాలా కష్టపడుతున్నారు. ప్రతి సినిమాను తన మొదటి సినిమాలా తీసుకునే ఆయన నిజంగా చాలా ఇన్‌స్పైరింగ్' అని చెప్పింది.
ఇంతవరకు రూమర్‌గా ఉన్న వార్త, ఇప్పుడు లక్ష్మీ కన్ఫర్మ్ చేసిన తర్వాత టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. మోహన్ బాబు ఈ సినిమాలో విలన్ పాత్రలో కనిపించబోతున్నారని టాక్. అది నిజమే అయితే, ఆన్ స్క్రీన్ పై నాని – మోహన్ బాబు వార్ ఓ రేంజులో ఉంటుందని ఊహించవచ్చు.
'ది ప్యారడైజ్' చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి SLV సినిమాస్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని 2026 మార్చి 26న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ, ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో వరల్డ్ వైడ్‌గా రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
-
Home
-
Menu