‘మిరాయ్‘లో ‘వైబ్ ఉంది‘!

సెప్టెంబర్ 5న విడుదలైన ‘మిరాయ్‘ బ్లాక్ బస్టర్ హిట్ సాధించింది. ఇప్పటికే బాక్సాఫీస్ వద్ద రూ.134 కోట్లకు పైగా వసూలు చేసిన ఈ చిత్రం.. ఇప్పటికీ స్ట్రాంగ్ గా దూసుకెళ్తుంది. తేజ సజ్జ హీరోగా, మంచు మనోజ్ విలన్ గా నటించిన ఈ చిత్రాన్ని కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించింది.
అయితే విడుదలకు ముందే సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేసిన ‘వైబ్ ఉంది’ పాట సినిమాకి జతచేయకపోవడంతో ఆడియన్స్ నిరాశ చెందారు. స్టోరీకి ఈ పాట అడ్డంకిగా ఉందనే ఉద్దేశ్యంతో ఈ పాటను తొలగించినట్లు టీమ్ తెలిపింది. కానీ ప్రేక్షకుల డిమాండ్ పెరగడంతో తాజాగా మేకర్స్ ఓ సర్ప్రైజ్ ప్రకటించారు.
ప్రపంచవ్యాప్తంగా అన్ని షోలలోనూ ఈరోజు నుంచి ‘వైబ్’ సాంగ్‌ను థియేటర్స్‌లో జత చేస్తున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. గౌర హరి సంగీతం, కృష్ణకాంత్ సాహిత్యం, అర్మాన్ మాలిక్ గాత్రంతో వచ్చిన ఈ పాట ఇప్పటికే యూట్యూబ్‌లో యూత్‌ని ఆకట్టుకుంది.
The vibe you’ve been waiting for is here ⚡️
— People Media Factory (@peoplemediafcy) September 23, 2025
The Chartbuster #VibeUndi song is now added in theatres worldwide 🥳
Watch #Mirai on the big screens and groove to the vibe ❤️🔥#BrahmandBlockbusterMirai In cinemas now 💥
Superhero @tejasajja123
Rocking Star @HeroManoj1… pic.twitter.com/8QNcyBc8wf
-
Home
-
Menu