‘మిరాయ్’ దసరా కానుక

తేజ సజ్జ, మంచు మనోజ్ ప్రధాన పాత్రల్లో కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఫాంటసీ అడ్వెంచర్ మూవీ ‘మిరాయ్’. సెప్టెంబర్ 12న విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లకు పైగా వసూలు చేసి బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది.
దసరా పండుగను పురస్కరించుకుని ఈ సినిమాను మరింత మంది ప్రేక్షకులకు చేరువ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ రేట్లను తగ్గించారు. బాల్కనీ టికెట్ ధరను రూ.150, ఫస్ట్ క్లాస్‌ను రూ.105 గా నిర్ణయించారు. దీంతో ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు మరింతగా వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రంలో రితిక నాయక్ హీరోయిన్‌గా, సీనియర్ నటి శ్రీయా ముఖ్య పాత్రలో నటించారు. టికెట్ రేట్ల తగ్గింపు, కొత్త పాట జోడింపు వంటి నిర్ణయాలతో ‘మిరాయ్’ కలెక్షన్లు మరోసారి ఊపందుకునే అవకాశం ఉందని పరిశ్రమ అంచనా వేస్తోంది.
This Dussehra, celebrate with your families & kids at the cinemas with #BrahmandBlockbusterMirai ❤️🔥
— People Media Factory (@peoplemediafcy) September 27, 2025
Experience #Mirai at the LOWEST TICKET PRICES across single screens in Telugu states 💥
Book your tickets now!
— https://t.co/BveSLQhrSI
Superhero @tejasajja123
Rocking Star… pic.twitter.com/XuYXsI6X6K
-
Home
-
Menu