‘మాస్ జాతర‘ నుంచి మెలోడీ

‘మాస్ జాతర‘ నుంచి మెలోడీ
X
మాస్ మహారాజ రవితేజ మాస్ పవర్ ను తెరపై ఆవిష్కరించబోతున్న చిత్రం ‘మాస్ జాతర‘. ఈ సినిమాకోసం మళ్లీ వింటేజ్ రవితేజను చూపిస్తానంటున్నాడు రైటర్ కమ్ డైరెక్టర్ భాను భోగవరపు.

మాస్ మహారాజ రవితేజ మాస్ పవర్ ను తెరపై ఆవిష్కరించబోతున్న చిత్రం ‘మాస్ జాతర‘. ఈ సినిమాకోసం మళ్లీ వింటేజ్ రవితేజను చూపిస్తానంటున్నాడు రైటర్ కమ్ డైరెక్టర్ భాను భోగవరపు. ఇక ‘ధమాకా‘ వంటి సూపర్ హిట్ తర్వాత రవితేజ, శ్రీలీల కాంబినేషన్ లో వస్తోన్న సినిమా కావడంతో ‘మాస్ జాతర‘పై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.

భీమ్స్ సంగీతాన్ని సమకూరుస్తున్న ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్ వచ్చేసింది. ‘హుడియో హుడియో‘ అంటూ సాగే ఈ గీతాన్ని భీమ్స్ తో పాటు మరో సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వాహబ్ ఆలపించాడు. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీలో డీసెండ్ మెలోడీగా ఈ పాట ఆకట్టుకుంటుంది. సితార ఎంటర్ టైన్ మెంట్స్ నుంచి అక్టోబర్ 31న ‘మాస్ జాతర‘ థియేటర్లలోకి వచ్చేస్తుంది.



Tags

Next Story