‘మాస్ జాతర’ కొత్త రిలీజ్ డేట్

‘మాస్ జాతర’ కొత్త రిలీజ్ డేట్
X
మాస్ మహారాజా రవితేజ 75వ సినిమాగా ‘మాస్ జాతర’ తెర‌కెక్కుతోంది. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో రవితేజ రైల్వే పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు.

మాస్ మహారాజా రవితేజ 75వ సినిమాగా ‘మాస్ జాతర’ తెర‌కెక్కుతోంది. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌లో రవితేజ రైల్వే పోలీస్ పాత్రలో కనిపించబోతున్నాడు. డ్యాన్సింగ్ క్వీన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుంది. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు.

ముందుగా సంక్రాంతి, ఆ తర్వాత వేసవి, వినాయక చవితి తేదీలలో ఈ చిత్రాన్ని తీసుకొద్దామనుకున్నారు. కానీ.. అనివార్య కారణాలతో సినిమా వాయిదా పడుతూ వచ్చింది. లేటెస్ట్ గా ఈ మూవీకి కొత్త రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేశారు. అక్టోబర్ 31న ‘మాస్ జాతర‘ థియేటర్లలోకి రాబోతున్నట్టు హీరో రవితేజ ఓ ఆసక్తికరమైన వీడియోతో పంచుకున్నాడు. ‘మాస్ జాతర‘ సినిమా పలుమార్లు వాయిదా పడడానికి కారణాలను వివరిస్తూ.. హైపర్ ఆదితో కలిసి ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చాడు రవితేజ.



Tags

Next Story