ఆగస్టులో 'మాస్ జాతర'!

మాస్ మహారాజా రవితేజ నుంచి రాబోతున్న లేటెస్ట్ మూవీ 'మాస్ జాతర'. ఈ సినిమాకి 'మనదే ఇదంతా' అనేది ట్యాగ్ లైన్. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ లో రూపొందుతున్న ఈ మూవీకి భాను బోగవరపు దర్శకుడు. లేటెస్ట్ గా 'మాస్ జాతర' రిలీజ్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. ఈ చిత్రం ఆగస్టు 27న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కు రెడీ అవుతుంది.
ఇప్పటికే 'మాస్ జాతర' నుంచి రిలీజైన గ్లింప్స్, 'తూ మేరా లవర్' సాంగ్స్ కు సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ పాటను దివంగత గాయకుడు చక్రి వాయిస్ లో రీ క్రియేట్ చేశారు. ఇక 'ధమాకా' తర్వాత రవితేజ, శ్రీలీల కాంబోలో వస్తోన్న మూవీ ఇది. అలాగే వీరిద్దరికీ తోడు భీమ్స్ మ్యూజిక్. మరోసారి 'మాస్ జాతర'తో ధమాకా పాటల పండగను తీసుకురావడానికి సిద్ధమవుతున్నారు రవితేజ, శ్రీలీల, భీమ్స్. మొత్తంగా ఆగస్టులో థియేటర్లలోకి రవితేజ 'మాస్ జాతర'ను తీసుకురాబోతున్నాడు.
It’s an official declaration of a 𝙈𝘼𝙎𝙎 𝙀𝙉𝙏𝙀𝙍𝙏𝘼𝙄𝙉𝙄𝙉𝙂 𝘽𝙊𝙉𝘼𝙉𝙕𝘼 this festive season 📢🔥
— Sithara Entertainments (@SitharaEnts) May 29, 2025
Mass Maharaaj @RaviTeja_offl is bringing a Full On Cracker of a show this Ganesh Chaturthi - AUGUST 27th 💥💥
ఈసారి పండక్కి సౌండ్ మామూలగుండదు….🥁🥁… pic.twitter.com/D7K2cosvCu
-
Home
-
Menu