మనోజ్ కుమార్ కన్నుమూత

బాలీవుడ్ నటుడు, దర్శకుడు మనోజ్ కుమార్ (87) కన్నుమూశారు. వయోభారం, అనారోగ్యంతో ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.
మనోజ్ కుమార్ అసలు పేరు హరికృష్ణ గోస్వామి. 1957లో ‘ఫ్యాషన్’ చిత్రంతో వెండితెర అరంగేట్రం చేశారు. ఆ తర్వాత ‘కాంచ్ కీ గుడియా’ వంటి సినిమాలతో గుర్తింపు పొందిన ఆయన, తర్వాత ‘ఉప్కార్, పురబ్ ఔర్ పశ్చిమ్, రోటీ కప్డా ఔర్ మకాన్‘ వంటి సినిమాలతో భారతీయ చలనచిత్ర రంగంలో ఓ ప్రత్యేక గుర్తింపుని సంపాదించారు. ఆయన సినిమాల్లో ఎక్కువగా దేశభక్తి అంశాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చేశారు. అందుకే ప్రేక్షకులు ప్రేమగా ఆయనను 'భరత్ కుమార్' అని పిలిచే స్థాయికి ఎదిగారు.
1999లో నటనకు విరామం ప్రకటించిన మనోజ్ కుమార్, సుదీర్ఘ సినీ ప్రయాణంలో నటుడిగా, దర్శకుడిగా, రచయితగా బాలీవుడ్‌ను ప్రభావితం చేశారు. సినీ రంగానికి అందించిన సేవల నేపథ్యంలో మనోజ్ కుమార్‌కు భారత ప్రభుత్వం 1992లో పద్మశ్రీ, 2015లో దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుతో సత్కరించింది.
-
Home
-
Menu