'మ్యాడ్ స్క్వేర్' కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్!

మ్యాడ్ స్క్వేర్ కోసం మ్యాన్ ఆఫ్ మాసెస్!
X
టాలీవుడ్‌లో క్రేజీ సీక్వెల్‌గా తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా విడుదలైనప్పటి నుంచి భారీ విజయాన్ని అందుకుంటూ దూసుకెళ్తోంది.

టాలీవుడ్‌లో క్రేజీ సీక్వెల్‌గా తెరకెక్కిన ‘మ్యాడ్ స్క్వేర్’ సినిమా విడుదలైనప్పటి నుంచి భారీ విజయాన్ని అందుకుంటూ దూసుకెళ్తోంది. కథతో సంబంధం లేకుండా సినిమా మొత్తంలో కామెడీ, ఎంటర్‌టైన్‌మెంట్ హైలైట్‌గా నిలవడంతో ప్రేక్షకుల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోంది.

ఇప్పటికే 'మ్యాడ్‌ స్క్వేర్' దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్‌ను సాధించింది. ఐదు రోజులకు వరల్డ్‌వైడ్‌గా ఈ చిత్రం రూ.74 కోట్లు గ్రాస్ వసూళ్లను కొల్లగొట్టింది. ప్రేక్షకులు అందిస్తున్న ఈ అమోఘమైన స్పందనను ఆస్వాదిస్తూ, ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ టీమ్‌ గ్రాండ్ సక్సెస్ ఈవెంట్‌ను నిర్వహించేందుకు ప్లాన్ చేస్తోందట. ఏప్రిల్ 4న జరిగే ఈ ఈవెంట్ కు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నాడని తెలుస్తోంది.

ఈ చిత్రంలో నార్నె నితిన్, రామ్ నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రల్లో నటించారు. డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ ఈ సినిమాను హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా మలిచాడు. భీమ్స్ అందించిన సంగీతం, తమన్ అందించిన నేపథ్య సంగీతం 'మ్యాడ్ స్క్వేర్'కి టెక్నికల్ గా ప్లస్ అయ్యాయి. ప్రముఖ నిర్మాణ సంస్థలు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చున్ ఫోర్ సినిమాస్, శ్రీకర స్టూడియోస్ పై సూర్యదేవర హారిక, సాయి సౌజన్య సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Tags

Next Story