మమ్ముట్టి, మోహన్‌లాల్ 'పేట్రియాట్'

మమ్ముట్టి, మోహన్‌లాల్ పేట్రియాట్
X
పదిహేడేళ్ల తర్వాత మలయాళ సినీ దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్‌లాల్ ఒకే ఫ్రేములో సందడి చేయబోతున్నారు. మహేష్ నారాయణన్ రూపొందిస్తున్న ‘పేట్రియాట్’ మూవీలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు.

పదిహేడేళ్ల తర్వాత మలయాళ సినీ దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్‌లాల్ ఒకే ఫ్రేములో సందడి చేయబోతున్నారు. మహేష్ నారాయణన్ రూపొందిస్తున్న ‘పేట్రియాట్’ మూవీలో వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు. ఈ సినిమాలో నయనతార, ఫహాద్ ఫాజిల్, కుంచకో బోబాన్ వంటి స్టార్స్ కూడా నటిస్తున్నారు. లేటెస్ట్ గా ఈ మూవీ తెలుగు టీజర్ ను రిలీజ్ చేశారు.

ఇందులో మమ్ముట్టి రిటైర్డ్‌ జె.ఏ.జి. ఆఫీసర్‌గా, మోహన్‌లాల్‌ సైనిక అధికారి పాత్రల్లో కనిపించబోతున్నారు. గతంలో 'టేకాఫ్' వంటి సూపర్ హిట్ మూవీని తీసిన మహేష్ నారాయణన్ ఈ సినిమాను దేశభక్తి ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఏప్రిల్ లో ఈ సినిమా రిలీజ్ కు రెడీ అవుతుంది.



Tags

Next Story