'స్పిరిట్'లో మలయాళీ బ్యూటీ

స్పిరిట్లో మలయాళీ బ్యూటీ
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోయే చిత్రాలలో 'స్పిరిట్'ది ప్రత్యేకమైన స్థానం. ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కిస్తుండటం అందుకు ప్రధాన కారణం.

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నుంచి రాబోయే చిత్రాలలో 'స్పిరిట్'ది ప్రత్యేకమైన స్థానం. ఈ చిత్రాన్ని సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్‌ రెడ్డి వంగా తెరకెక్కిస్తుండటం అందుకు ప్రధాన కారణం. ఈ యాక్షన్ ఎమోషనల్ థ్రిల్లర్‌లో ప్రభాస్ పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా గా కనిపించబోతున్నాడు. ఈ ప్రాజెక్ట్ ఇంకా పట్టాలెక్కకపోయినా.. ప్రీ ప్రొడక్షన్ పనులు సైలెంట్ గా పూర్తవుతున్నాయి.

ఈ సినిమాలో హీరోయిన్‌గా దీపికా పదుకొనెను అనుకున్నా, తర్వాత త్రిప్తి డిమ్రి ఫైనల్ అయ్యింది. లేటెస్ట్ గా ఈ మూవీలో మరో సర్ప్రైజ్ కాస్టింగ్ బయటకొచ్చింది. మలయాళ బ్యూటీ మడోన్నా సెబాస్టియన్ ఈ చిత్రంలో కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. అయితే ఆమె సెకండ్ లీడ్‌గా చేస్తుందా? లేక నెగటివ్ షేడ్స్‌లో కనిపిస్తుందా? అన్నది ఇంకా మిస్టరీగానే ఉంది.

‘ప్రేమమ్’తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత ‘శ్యామ్ సింగరాయ్’లో సందడి చేసింది. మళ్లీ ఇప్పుడు 'స్పిరిట్' రూపంలో తెలుగు ఆడియన్స్ ను పలకరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకవేళ 'స్పిరిట్' వంటి పాన్ ఇండియా ప్రాజెక్ట్‌లో మడోన్నా భాగమైతే.. ఇది ఆమె కెరీర్ కు టర్నింగ్ పాయింట్ అయ్యే అవకాశాలున్నాయి. నవంబర్ 5 నుంచి 'స్పిరిట్' పట్టాలెక్కనుందట.

Tags

Next Story