పవర్‌ఫుల్ లుక్‌లో మహదేవ శాస్త్రి

X
నటుడిగా, నిర్మాతగా సినిమా రంగంలో మోహన్ బాబుది 50 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణం. ఈరోజు నట ప్రపూర్ణ మోహన్ బాబు పుట్టినరోజు.
నటుడిగా, నిర్మాతగా సినిమా రంగంలో మోహన్ బాబుది 50 ఏళ్ల సుధీర్ఘ ప్రయాణం. ఈరోజు నట ప్రపూర్ణ మోహన్ బాబు పుట్టినరోజు. ఈ సందర్భంగా 'కన్నప్ప' చిత్రం నుంచి మోహన్ బాబు పోషిస్తున్న మహదేవ శాస్త్రి సాంగ్ గ్లింప్స్ ను రిలీజ్ చేశారు. ఓం నమః శివాయ అంటూ సాగే ఈ గీతాన్ని స్టీఫెన్ దేవస్సీ సంగీతంలో సుద్దాల అశోక్ తేజ రాయగా శంకర్ మహాదేవన్ ఆలపించాడు.
ఈ పాటలో మోహన్ బాబు మహాదేవ శాస్త్రిగా ఎంతో పవర్‌ఫుల్ గా కనిపిస్తున్నారు. సినిమాలో ఈ రోల్ ఎంతో కీలకంగా ఉండబోతున్నట్టు ఈ విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇప్పటికే 'కన్నప్ప' నుంచి విడుదలైన రెండు పాటలకు మంచి రెస్పాన్స్ దక్కింది. ఇప్పుడు మూడో పాటగా వచ్చిన ఈ గీతం కూడా బాగా ఆకట్టుకుంటుంది. ముఖేష్ కుమార్ సింగ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ గా విడుదలవుతుంది.
Next Story
-
Home
-
Menu