'కుబేర' ఓటీటీ పార్టనర్ లాక్డ్!

కుబేర ఓటీటీ పార్టనర్ లాక్డ్!
X
వెర్సటైల్ యాక్టర్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన 'కుబేర' నిన్న విడుదలై థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది.

వెర్సటైల్ యాక్టర్ ధనుష్, కింగ్ నాగార్జున, నేషనల్ క్రష్ రష్మిక ప్రధాన పాత్రల్లో నటించిన 'కుబేర' నిన్న విడుదలై థియేటర్లలో మంచి రెస్పాన్స్ దక్కించుకుంటుంది. డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించిన విధానానికి ఇటు తెలుగు, అటు తమిళ ఆడియన్స్ బ్రహ్మరథం పడుతున్నారు.

ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్ గా రన్ అవుతున్న ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ – శాటిలైట్ స్ట్రీమింగ్ పార్ట్‌నర్స్‌ను కూడా ఫిక్స్ చేసుకుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఈ మూవీకి డిజిటల్ పార్టనర్ గా ఫిక్సయ్యింది. అలాగే శాటిలైట్ రైట్స్ ను స్టార్ మా ఛానెల్ దక్కించుకుంది.

సునీల్ నారంగ్, పుస్కుర్ రామ్మోహనరావు సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం ఎంతో ప్లస్ అయ్యింది. ఫస్ట్ డే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న 'కుబేర'కు.. శనివారం, ఆదివారం హాలిడేస్ కలిసి రానున్నాయి. ఈ వీకెండ్ వరకే ఈ చిత్రం రూ.100 కోట్ల మార్కును దాటే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.

Tags

Next Story