'కుబేర' కలెక్షన్ల వర్షం!

చాలా రోజుల తర్వాత టాలీవుడ్ బాక్సాఫీస్ దగ్గర ఫుల్ జోష్ కనిపిస్తోంది. స్టార్స్ నాగార్జున, ధనుష్ కలిసి నటించిన ఈ మల్టీస్టారర్ వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. తొలిరోజు తెలుగు రాష్ట్రాల్లో 57.36% ఆక్యుపెన్సీ నమోదవడం గమనార్హం. ముఖ్యంగా నాగార్జున–ధనుష్ కాంబినేషన్, శేఖర్ కమ్ముల తొలిసారిగా చేసిన మాస్ క్రైమ్ థ్రిల్లర్ అనేది ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
విడుదలకు ముందు పెద్దగా హైప్ లేకపోయినా, ఫస్ట్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు భారీగా పెరుగుతున్నాయి. ఫస్ట్ డే వరల్డ్ వైడ్ గా రూ.30 కోట్లు గ్రాస్ సాధించిందనేది అంచనా. తెలుగు రాష్ట్రాలలో 13 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ మూవీ తమిళనాడు రూ.5 కోట్లు, కర్ణాటక మరియు ఇతర ప్రాంతాలు కలిపి రూ.3 కోట్లు వసూలు చేసింది.
మరోవైపు ఓవర్సీస్ లో 'కుబేర'కి మంచి రెస్పాన్స్ దక్కుతుంది. ప్రీమియర్స్ తో కలిపి ఫస్ట్ డే అక్కడ 9 లక్షల డాలర్లు కొల్లగొట్టినట్టు తెలుస్తోంది. అంటే రూ.7.5 కోట్లు పైమాటే. శేఖర్ కమ్ముల చిత్రాలకు ఓవర్సీస్ లో మంచి మార్కెట్ ఉంది. అది 'కుబేర'కి బాగా కలిసొస్తుంది.
-
Home
-
Menu