‘కొత్త లోక’ ఓటీటీ? దుల్కర్ క్లారిటీ!

మలయాళంలో సంచలన విజయాన్ని సాధించిన తొలి ఉమన్ సూపర్ హీరో చిత్రం ‘లోక’. ఈ సినిమాని తెలుగులో ‘కొత్త లోక’ పేరుతో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ రిలీజ్ చేసింది. కేవలం రూ.30 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం, ఇప్పటివరకే ప్రపంచవ్యాప్తంగా దాదాపు రూ.270 కోట్ల గ్రాస్ వసూలు చేసి మలయాళ సినీ చరిత్రలోనే అతిపెద్ద హిట్‌గా నిలిచింది.
బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రన్ కొనసాగిస్తోన్న ఈ మూవీలో ప్రధాన పాత్రలో నటించిన కల్యాణి ప్రియదర్శన్ తన కెరీర్‌లోనే ఉత్తమమైన గుర్తింపు తెచ్చుకుంది. ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్ కొనసాగుతున్న ‘కొత్త లోక’ త్వరలోనే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందనే రూమర్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అంతేకాదు, ఈ శుక్రవారం నుంచే సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులోకి వస్తుందంటూ పలు వెబ్‌సైట్స్ కథనాలు రాయడంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
అయితే, ఈ ప్రచారాలపై స్వయంగా నిర్మాత దుల్కర్ సల్మాన్ స్పందించాడు. ఆయన తన 'ఎక్స్' అక్కౌంట్ ద్వారా '‘లోక’ సినిమా ఇప్పట్లో ఓటీటీలోకి రాదు. దయచేసి తప్పుడు వార్తలను నమ్మకండి. అధికారిక ప్రకటన కోసం వేచి ఉండండి. ఇంకా థియేటర్లలోనే విజయవంతంగా ప్రదర్శితమవుతోంది' అంటూ స్పష్టం చేశాడు. దీంతో నెటిజన్లలో ఏర్పడిన కన్ఫ్యూజన్‌కు చెక్ పడింది.
Lokah isn't coming to OTT anytime soon. Ignore the fake news and stay tuned for official announcements! #Lokah #WhatstheHurry
— Dulquer Salmaan (@dulQuer) September 21, 2025
-
Home
-
Menu