‘కింగ్డమ్‘ కొత్త డేట్ ఫిక్స్!

‘కింగ్డమ్‘ కొత్త డేట్ ఫిక్స్!
X
ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు మన చిత్ర పరిశ్రమపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ సమయంలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం కష్టతరమవుతుంది. అందుకే.. మే 30న రావాల్సిన విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్‘ వాయిదా పడింది.

ప్రస్తుతం దేశంలో నెలకొన్న పరిస్థితులు మన చిత్ర పరిశ్రమపై కూడా ప్రభావం చూపుతున్నాయి. ఈ సమయంలో ప్రచార కార్యక్రమాలను నిర్వహించడం కష్టతరమవుతుంది. అందుకే.. మే 30న రావాల్సిన విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్‘ వాయిదా పడింది.

సితార ఎంటర్ టైన్ మెంట్స్ లో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కింగ్డమ్‘ చిత్రంపై ఇప్పటికే మంచి అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాలో విజయ్ దేవరకొండకి జోడిగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. అనిరుధ్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూరుస్తున్నాడు. మే 30న రావాల్సిన ఈ చిత్రం జూలై 4కి వాయిదా పడింది.

ఈ విషయాన్ని సోషల్ మీడియాలో తెలుపుతూ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్ మెంట్స్ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘మే 30న సినిమాను విడుదల చేయాలని మేము తీవ్రంగా ప్రయత్నించాం. కానీ ఇటీవల దేశంలో చోటుచేసుకున్న అనూహ్య పరిణామాల నేపథ్యంలో, ప్రమోషన్‌లు, వేడుకలు నిర్వహించడం కష్టతరమైంది. అందుకే మేము జూలై 4న సినిమాను విడుదల చేయాలని నిర్ణయించాం. ఈ ఆలస్యం ‘కింగ్డమ్‌’ చిత్రాన్ని మరింత మెరుగ్గా మలచడానికి సహాయపడుతుంది. సినిమా కాస్త ఆలస్యంగా వస్తున్నా, ప్రేక్షకుల అంచనాలకు తగ్గకుండా ఉంటుంది.‘ అని సితార తెలిపింది.

అలాగే.. అదే రోజు నితిన్ ‘తమ్ముడు‘ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. అయితే ‘కింగ్డమ్‘ కోసం ‘తమ్ముడు‘ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా నిర్మాతలు దిల్ రాజు, నటుడు నితిన్‌లకు విడుదల తేదీ మార్పుపై అండగా నిలిచినందుకు కృతజ్ఞతలు తెలిపింది సితార సంస్థ.



Tags

Next Story