‘కింగ్ డమ్‘ ఫస్ట్ సింగిల్ అప్డేట్!

టాలీవుడ్ నుంచి భారీ అంచనాల మధ్య రాబోతున్న ప్రాజెక్ట్స్ లో ‘కింగ్ డమ్‘ ఒకటి. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే విడుదలైన టీజర్ ద్వారా భారీ ఆసక్తిని కలిగించింది. అయితే ‘కింగ్ డమ్‘ అనుకున్న సమయానికి రావడం కష్టమేనని.. ఈ సినిమా వాయిదా పడబోతుందనే న్యూస్ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది.
ఇటీవలే ‘కింగ్ డమ్‘ అనుకున్న సమయానికే వస్తుందన్న సంకేతాలను హీరో విజయ్ దేవరకొండ ఇచ్చాడు. ఈ సినిమా డబ్బింగ్ చెబుతున్న ఫోటోని షేర్ చేశాడు. లేటెస్ట్ గా సితార అధినేత నాగవంశీ ఈ సినిమా ఫస్ట్ సింగిల్ అప్డేట్ ఇచ్చారు. ‘కింగ్ డమ్‘ చిత్రం నుంచి ఈ వారంలోనే ఫస్ట్ సింగిల్ కి సంబంధించి అప్డేట్ రానుందని సోషల్ మీడియాలో తెలిపారు నాగవంశీ.
కోలీవుడ్ రాక్ స్టార్ అనిరుధ్ సంగీతం ‘కింగ్ డమ్‘కి ఎంతో ప్లస్ అవుతుందనే అంచనాలున్నాయి. ఆ అంచనాలకు మించిన రీతిలో ఈ సినిమా ఆల్బమ్ ఉండబోతున్నట్టు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రూపొందుతున్న ‘కింగ్ డమ్‘ చిత్రం మే 30న విడుదలకు ముస్తాబవుతుంది.
The #KINGDOM Storm begins with a soulful enchanting song ❤️❤️
— Naga Vamsi (@vamsi84) April 20, 2025
Let’s all meet with a First Single Update this week followed by the song release 🔥🔥
-
Home
-
Menu