కీర్తి సురేష్, సుహాస్ ‘ఉప్పు కప్పురంబు‘

X
‘మహానటి‘ కీర్తి సురేష్, టాలెంటెడ్ సుహాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందబోతుందని గతంలోనే వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ చిత్రం పూర్తవ్వడం.. విడుదలకు సిద్ధమవ్వడం జరుగుతుంది.
‘మహానటి‘ కీర్తి సురేష్, టాలెంటెడ్ సుహాస్ కాంబినేషన్ లో ఓ సినిమా రూపొందబోతుందని గతంలోనే వార్తలొచ్చాయి. ఇప్పుడు ఆ చిత్రం పూర్తవ్వడం.. విడుదలకు సిద్ధమవ్వడం జరుగుతుంది. అయితే.. సిల్వర్ స్క్రీన్ పై కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రత్యేకంగా ఈ మూవీ స్ట్రీమింగ్ కి రెడీ అవుతుంది. ఆ చిత్రమే ‘ఉప్పు కప్పురంబు’. ఈ సినిమాలో బాబు మోహన్, శత్రు, తాళ్లూరి రామేశ్వరి ఇతర కీలక పాత్రలు పోషించారు.
చిట్టి జయపురం అనే కల్పిత గ్రామం.. అక్కడ ఎదురయ్యే అసాధారణ సంఘటనలు.. ప్రజలు దాన్ని ఎలా ఎదుర్కొన్నారన్నదే ఈ సినిమా కథ అట. వసంత్ మురళీకృష్ణ మరింగంటి అందించిన కథతో 90ల బ్యాక్ డ్రాప్ తో సెటైరికల్ కామెడీగా ఈ సినిమాని ఐ.వి. శశి రూపొందించారు. ఎల్లనార్ ఫిలిమ్స్ బ్యానర్‌పై రాధిక లావు నిర్మించిన ఈ చిత్రం జూలై 4 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో పలు భాషల్లో స్ట్రీమింగ్ కానుంది.
Next Story
-
Home
-
Menu