ఐమాక్స్ ఫార్మాట్ లో ‘కాంతార‘

ఐమాక్స్ ఫార్మాట్ లో ‘కాంతార‘
X
కన్నడలో చిన్న సినిమాగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది ‘కాంతార‘ చిత్రం. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారత సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది.

కన్నడలో చిన్న సినిమాగా విడుదలై ప్రపంచవ్యాప్తంగా సంచలన విజయాన్ని సాధించింది ‘కాంతార‘ చిత్రం. కేవలం రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా, రూ.400 కోట్లకు పైగా వసూళ్లు సాధించి, భారత సినిమా చరిత్రలో మైలురాయిగా నిలిచింది. అలాంటి సూపర్ హిట్ ‘కాంతార‘కి ప్రీక్వెల్ గా డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి ‘కాంతార: చాప్టర్ 1’ను రిలీజ్ కు రెడీ చేస్తున్నాడు. ఈ సినిమా అక్టోబర్ 2న విడుదలకు ముస్తాబవుతుంది.

హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న ‘కాంతార: చాప్టర్ 1‘ చిత్రాన్ని ఐమాక్స్ ఫార్మాట్‌లో విడుదల చేయబోతున్నారు. సాధారణంగా ఐమ్యాక్స్ స్క్రీనింగ్ ఒరిజినల్ లాంగ్వేజ్‌కే పరిమితం అవుతుంది. కానీ ఈసారి అన్ని భాషల్లోనూ ఐమ్యాక్స్ స్క్రీనింగ్ ప్లాన్ చేస్తున్నారని టాక్ వినిపిస్తోంది. ఉత్తర అమెరికాలోనే 50కి పైగా ఐమ్యాక్స్ స్క్రీన్‌లలో రిలీజ్ చేయనున్నారన్న వార్త ఈ సినిమాపై ఉన్న గ్లోబల్ క్రేజ్‌కు అద్దం పడుతుంది.

మరోవైపు మేకర్స్ అక్టోబర్ 1న సాయంత్రం 7 గంటలకు వరల్డ్‌వైడ్ ప్రీమియర్ షోలు నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. ఇది జరిగితే కన్నడ పరిశ్రమలో తొలి బిగ్ బడ్జెట్ ప్రీమియర్ షో మూవీ ఇదే అవుతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ ‘కాంతారా: చాప్టర్ 1’కు అద్భుతమైన డిమాండ్ ఉంది. గీతా ఆర్ట్స్, మైత్రీ మూవీ మేకర్స్, వారాహి చలనచిత్రం వంటి ప్రముఖ సంస్థలు ఈ సినిమాని రిలీజ్ చేయనున్నాయి. ఈ సినిమాలో రిషబ్ శెట్టికి జోడీగా రుక్మిణి వసంత్ నటించింది. మొత్తంగా.. ఇప్పటికే ప్రచార చిత్రాలతో మంచి బజ్ ఏర్పరచుకున్న ‘కాంతారా: చాప్టర్ 1’ విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.



Tags

Next Story