‘కాంతార‘ సెన్సార్ కంప్లీట్.. రన్ టైమ్ ఎంతంటే?

‘కాంతార‘ సెన్సార్ కంప్లీట్.. రన్ టైమ్ ఎంతంటే?
X
2022లో విడుదలైన ‘కాంతార‘ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యం, గిరిజన సంప్రదాయాలు, దేవతా విశ్వాసాలు కలగలిపిన ఆ కథ అందరినీ ఉర్రూతలూగించింది.

2022లో విడుదలైన ‘కాంతార‘ సినిమా దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. గ్రామీణ నేపథ్యం, గిరిజన సంప్రదాయాలు, దేవతా విశ్వాసాలు కలగలిపిన ఆ కథ అందరినీ ఉర్రూతలూగించింది. ఇప్పుడు అదే సిరీస్‌లో ‘కాంతార చాప్టర్ 1‘ రాబోతుంది. ఈ సినిమాతో మరోసారి ప్రేక్షకుల్ని మిస్టిక్ వరల్డ్‌లోకి తీసుకెళ్లడానికి సిద్ధమవుతున్నాడు డైరెక్టర్ కమ్ హీరో రిషబ్ శెట్టి.

లేటెస్ట్ గా రిలీజైన ‘కాంతార చాప్టర్ 1‘ ట్రైలర్‌ కి ట్రెమండస్ రెస్పాన్స్ దక్కుతుంది. రిలీజైన కొన్ని గంటల్లోనే ఈ ట్రైలర్ 55 మిలియన్ల వ్యూస్ ను కొల్లగొట్టింది. కళ్లు మిరుమిట్లు గొలిపే విజువల్స్‌తో, గూస్‌బంప్స్ తెప్పించే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌తో ఈ ట్రైలర్ అద్భుతంగా నిలిచింది. ఈ ట్రైలర్ లో పంజుర్లి దేవతకు సంబంధించిన సన్నివేశాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉండగా, అడవిలో జీవించే తెగ, వారిని అణచివేయాలనుకునే రాజు మధ్య జరిగే పోరాటం కథలో ప్రధానంగా కనిపిస్తోంది. హీరోయిన్‌ రుక్మిణి వసంత్‌ మహారాణిగా ప్రత్యేకంగా ఆకట్టుకుంది. రిషబ్‌ శెట్టి నటన, దర్శకత్వ ప్రతిభ మరోసారి కొత్త మేజిక్‌ సృష్టించనున్నట్లు ఈ ట్రైలర్ తో అర్థమవుతుంది.

మరోవైపు ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుని U/A 16+ సర్టిఫికెట్‌ పొందింది. 2 గంటల 48 నిమిషాల నిడివితో ఈ చిత్రం తయారయ్యింది. ఇక ఈ సినిమా షూటింగ్ సమయంలో నాలుగుసార్లు ప్రమాదాలు జరిగాయని, అప్పుడే తనకు ప్రాణహాని వాటిల్లేదని రిషబ్ శెట్టి షాకింగ్ న్యూస్ రివీల్ చేశాడు. ‘ఆ దేవుడి దయ వల్లే నేను బయటపడ్డాను. మా టీమ్‌ అంతా విశ్రాంతి లేకుండా మూడు నెలలపాటు పని చేసింది. ప్రతి ఒక్కరూ తమ సినిమా అన్న భావనతో కష్టపడ్డారు. అందుకే ఈ ప్రాజెక్ట్‌ పూర్తయింది‘ అని ఆయన ట్రైలర్ లాంఛ్ సందర్భంగా ఎమోషనల్‌గా చెప్పాడు. మొత్తంగా.. భారీ అంచనాలతో అక్టోబర్ 2న ‘కాంతార చాప్టర్ 1‘ వచ్చేస్తోంది.

Tags

Next Story